Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్ ధర రూ.272, డీజిల్ ధర రూ.273.. ఎక్కడంటే..?

పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు (Petrol Diesel Price Hike) ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 01:17 PM IST

Petrol Diesel Price Hike: ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం భారం పెంచింది. పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు (Petrol Diesel Price Hike) ప్రకటించారు. పాకిస్తాన్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.19.95 పెంచింది. దింతో పెట్రోల్ ధర లీటర్ రూ.272.95కి చేరింది. అదే సమయంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.19.90 పెరిగింది. దింతో డీజిల్ ధర లీటర్‌కు రూ.273.40కి పెరిగింది. కొత్త రేట్లు 1 ఆగస్టు 2023 నుండి అమలులోకి వచ్చాయి.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం: ఆర్థిక మంత్రి

మంగళవారం పెట్రోలు, డీజిల్ ధరలను ప్రకటించిన ఆర్థిక మంత్రి.. ‘జాతీయ ప్రయోజనాల’ దృష్ట్యా షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సోమవారం సమీక్షా సమావేశం అనంతరం ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. ధరను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

Also Read: QR Code On Medicines: మెడిసిన్స్ అసలైనవో, కాదో తెలుసుకోవచ్చు ఇలా.. టాప్ 300 మందులపై క్యూఆర్ కోడ్.!

IMF షరతులకు కట్టుబడి ఉంది

తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి సమర్థిస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రయత్నించామని, అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అందరికీ తెలిసిందే. దీనితో పాటు, ఈ ఒప్పందాలన్నీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని కూడా ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితిలో మేము IMF షరతులను అనుసరించడం అవసరం అన్నారు.

LPG ధరలు కూడా పెరిగాయి

పాకిస్థాన్‌లో పెట్రోల్-డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ ధర కూడా భారీగా పెరిగింది. ఆగస్టు ప్రారంభం నుండి LPG ధర 17.5 శాతం, LPG వినియోగదారుల విక్రయ ధర 13.5 శాతం పెరిగింది. దీని తరువాత ఇక్కడ 11.8 కిలోల సిలిండర్ 886.30 పాకిస్తాన్ రూపాయలకు అందుబాటులో ఉంది. వినియోగదారు ధర రూ. 2,373.64. పెరిగిన LPG ధర కారణంగా దాని ప్రత్యక్ష ప్రభావం సామాన్య ప్రజల వంటగది బడ్జెట్‌పై కనిపిస్తోంది. జూన్ 2023లో ద్రవ్యోల్బణం రేటు ఏడు నెలల కనిష్ట స్థాయి 29.4 శాతానికి చేరినప్పటికీ పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల వెన్ను విరిచిందని గమనించాలి. మే నెలలో ద్రవ్యోల్బణం 38 శాతంగా ఉంది.