Site icon HashtagU Telugu

Pepsi: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పెప్సి కో..!

Pepsi Employees

Pepsi

అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన పెప్సీ కో(Pepsi Co) కూడా తన కంపెనీ ఉద్యోగులకు(Employees) షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీలో వందలాది మందిని తొలగించనున్నట్లు పెప్సీ కో (Pepsi Co) అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ నివేదించిన నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగాల కోత ప్రారంభించాయి. అనిశ్చిత ఆర్థిక వాతావరణం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్ (CNS), అమెజాన్ (Amazon), ఆపిల్ (Apple), మెటా (Meta) కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.