ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో, వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ (Telegram CEO Pavel Durov) తన జీవితానికి సంబంధించిన మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దురోవ్ మాట్లాడుతూ.. తన వీర్యదానంతో జన్మించిన 106 మంది పిల్లలకు తన సంపదను పంచిపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీరిని గుర్తిస్తూ ఒక వీలునామా రాశానని , ఈ పిల్లలు తన సహజ సంతానంతో సమానమేనని, వారందరికీ తన సంపదపై సమానమైన హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
Vivo Y400 Pro: భారత విపణిలోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్
సుమారు 20 బిలియన్ డాలర్ల తన ఆస్తిని ఈ పిల్లలకు సమానంగా పంచుతానని ప్రకటించిన దురోవ్, ఇది ఒక్కసారిగా వారికీ అందకుండా, వారు 30 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారికీ అందుతుందని తెలిపారు. ఎందుకంటే వారు స్వతంత్రంగా, తమ శక్తిని ఉపయోగించుకుని ఎదగాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. పిల్లలు సంపద మీద ఆధారపడకుండా బలంగా ఎదగాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు
గతంలో కూడా పావెల్ దురోవ్ ఇదే తరహా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను వివాహం చేసుకోకపోయినా, గత 15 ఏళ్లుగా వీర్యదానం చేస్తూ ప్రపంచంలోని 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు జన్మించేలా చేశానని గతేడాది జూలైలో వెల్లడించారు. టెక్ ప్రపంచంలోనే కాదు, దాతృత్వ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న దురోవ్ చర్యలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. సంపద పంచడంలో ఉన్న వ్యూహాత్మకత, సమానత్వ దృక్పథం పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.