Fist Fight: ఇటీవల విమానాల్లో కొంతమంది ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. తోటి ప్రయాణికుల మధ్య అనుచితంగా ప్రవర్తించడం లాంటివి విమానాల్లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి మహిళతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహిళపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారింది.
ఈ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఈ ఘటన చోటుచేసుకుంది ఇండియాలో కాదు.. బంగ్లాదేశ్‌కు చెందిన బిమన్ బంగ్లాదేశ్ విమానంలో ఆ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. చొక్కా విప్పేసి తోటి ప్రయాణికుడితో గొడవకు దిగాడు. వారిద్దరూ కొట్టుకున్న వీడియోను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిటంకో బిశ్వాస్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడిోను పోస్ట్ చేశాడు. అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందనేది తెలియడం లేదు. తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి పిడిగుద్దులు గుద్దినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఎదుటి వ్యక్తికి దాడికి పాల్పడ్డారు. తోటి ప్రయాణికులు ఈ గొడవను అడ్డుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇలాంటి వ్యక్తులను అసలు ఇక విమానం ఎక్కనీయకుండా నిషేధించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విమాన ప్రయాణం ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. ఇది విమానమేనా.. బస్సులో కొట్టుకుంటున్నట్లు కొట్టుకోవడం ఏంటి అంటూ కామెంట్ చేస్తోన్నారు. విమాన సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.