Palestina PM: గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా: పాలస్తీనా ప్రధాని రాజీనామా

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యా ఈరోజు రాజీనామా చేశారు. అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .

Palestina PM: పాలస్తీనా ప్రధాని రాజీనామా చేశారు. హామాస్ ఇజ్రాయెల్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యా ఈరోజు రాజీనామా చేశారు. అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .

గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే తన రాజీనామా ఆమోదంపై అధ్యక్షుడి నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. ఆమోదం పొందితే పాలస్తీనా ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ ఛైర్మన్‌గా ఉన్న మొహమ్మద్‌ ముస్తఫాను నూతన ప్రధానిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హమాస్ దాడి నేపథ్యంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ బలగాలు యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, పాలస్తీనాలో రాజకీయ ఏకాభిప్రాయం సాధించేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని సయే తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ వార్ నేపథ్యంలో అమెరికా పాలస్తీనాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అమెరికా కూడా రాజకీయంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.

Also Read: Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల రద్దు సరైందే.. నోబెల్ గ్రహీత అమర్య్తసేన్ కామెంట్స్