Army Chief Vs Army : పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు ? ఇమ్రాన్ ఖాన్‌కు మంచి రోజులు !

ఈ ఒత్తిడుల నేపథ్యంలో ఆసిమ్ మునీర్(Army Chief Vs Army) రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Pakistans Army Chief Asim Munir Vs Army Pakistan Military Coup

Army Chief Vs Army : పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు జరగబోతోందా ? ఈసారి సైనిక తిరుగుబాటు ఏకంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పైనేనా ? అంటే.. ఔను అనేలా సంకేతాలు కనిపిస్తున్నాయి.  తాజాగా ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. బెలూచిస్తాన్ వేర్పాటువాదులు రైలును హైజాక్ చేసి 200 మందికిపైగా పాక్ సైనికులను హతమార్చిన ఘటనతో పాక్ ఆర్మీలో పెనుమార్పు వచ్చింది. జవాన్ల నుంచి మొదలుకొని కెప్టెన్లు, మేజర్లు, కల్నల్స్ వరకు అన్ని ర్యాంకుల అధికారుల్లో ఆర్మీ చీఫ్‌పై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ రాజీనామా చేయాల్సిందే అని వారంతా అల్టిమేటం జారీచేశారు. లేదంటే తాము ఆయనపై తిరుగుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

Also Read :BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్‌లైన్ చెల్లింపులు!

ఆర్మీ లేఖలో ఏముంది ? 

ఆసిమ్‌ మునీర్ వైఫల్యాలను ఒక్కటొక్కటిగా పేర్కొంటూ ఒక  సుదీర్ఘ లేఖను పాకిస్తాన్ ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి.  ఆర్మీ చీఫ్ రాజీనామా చేయకుంటే తామే చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, సైన్యాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాక్ ఆర్మీలో ఉన్న గ్రూపులు, వర్గ విభేదాలు మరోసారి ప్రపంచం ముందుకు వచ్చాయి. అణ్వస్త్రాలు కలిగిన దేశంలో ఆర్మీ ఇంత బలహీనంగా ఉంటుందా ? అని అంతటా చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కల్నల్స్, మేజర్లు, కెప్టెన్లు, జవాన్లు రాసిన లేఖలో.. ‘‘ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాలనలో పాకిస్తాన్ 1971 (బంగ్లాదేశ్ విభజన) నాటి పరిస్థితులను చూస్తోంది. మునీర్ వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ అసమ్మతిని అణచివేయడానికి, జర్నలిస్టుల్ని సైలెంట్ చేయడానికి, ప్రజాస్వామ్య శక్తుల్ని అణచివేయడానికి ఆర్మీని మునీర్ ఉపయోగించారు. దీనివల్ల సైన్యం ప్రతిష్ట దిగజారింది. ఒక వేళ ఆయన రాజీనామా చేయకుంటే సైన్యం స్వయంగా చర్య తీసుకుంటుంది’’ అని ప్రస్తావించారు.

Also Read :UPI Outage: ఫోన్ పే, గూగుల్ పే సేవలకు అంతరాయం.. కారణం చెప్పిన NPCI

ఇమ్రాన్ ఖాన్ లాబీయే ఇదంతా చేస్తోందా ? 

ఈ ఒత్తిడుల నేపథ్యంలో ఆసిమ్ మునీర్(Army Chief Vs Army) రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా సైతం ఆయనపై గుర్రుగా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌పై ఆంక్షలు విధించాలని కోరుతూ ఇటీవలే  అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని  ఆ బిల్లులో ప్రస్తావించడం గమనార్హం. పాక్ సైన్యంలో ఇమ్రాన్‌కు అనుకూలంగా ఉండే లాబీ ఇదంతా రహస్యంగా చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆసిమ్ మునీర్ రాజీనామా చేశాక.. జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ విడుదలకు మార్గం సుగమం  కావచ్చని భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌‌లో ఆర్మీ తిరుగుబాటు అనే సర్వసాధారణ విషయంగా మారిపోయింది. చరిత్రను పరిశీలిస్తే.. 1958లో ఆర్మీ చీఫ్ అయ్యూబ్ ఖాన్ తిరుగుబాటు చేశారు. 1977లో జనరల్ జియా ఉల్ హక్  తిరుగుబాటు చేశారు. 1999లో నవాజ్ షరీఫ్‌‌పై ముషారఫ్ తిరుగుబాటు చేశారు.

  Last Updated: 27 Mar 2025, 08:10 AM IST