Pakistan Passports : ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. పాస్‌పోర్ట్‌లను ప్రింట్ చేయడానికి ఉపయోగించే లామినేషన్ పేపర్ల కొరత ప్ర్రస్తుతం ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టుల జారీ తగ్గిపోయింది. ఇంతకుముందు పాకిస్తాన్‌కు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్ట్స్ (DG I&P) ప్రతిరోజు దాదాపు 4వేల పాస్‌పోర్టులను ప్రాసెసింగ్ చేసేది. ఇప్పుడు లామినేషన్ పేపర్ల కొరత కారణంగా ఆ సంఖ్య 13కు తగ్గిపోవడం గమనార్హం. దీంతో పాక్ నుంచి విదేశాలకు వెళ్లాల్సి ఉన్న విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, హజ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పాకిస్తాన్ పాస్‌పోర్టుల తయారీ కోసం వాడే లామినేషన్ పేపర్‌ను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ పేపర్ల కొనుగోలు కోసం ఆర్డర్లు ఇవ్వడం ఆగిపోయింది. పాత స్టాక్ అంతా అయిపోయింది. దీంతో పాస్‌పోర్టుల ప్రింటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచే పాక్‌లో పాస్‌పోర్టుల జారీ ఈవిధంగా స్తంభించింది. ఫలితంగా ఎంతోమంది విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
Also Read: 1899 Jobs : స్పోర్ట్స్ కోటాలో 1899 ‘పోస్టల్’ జాబ్స్
ఆర్థిక సంక్షోభంతో ఏర్పడిన ఇంధన కొరత కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిర్ లైన్స్ సంస్థ ఇటీవల వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇంధన బకాయిలు చెల్లించకపోవడంతో విమానయాన సంస్థకు చమురు సంస్థలు ఇంధన సరఫరాను ఆపేశాయి. రుణభారం పెరగడంతో పాక్ ప్రభుత్వ విమానయాన సంస్థను ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రోజువారీ ఖర్చుల కోసం ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని పాక్ ఎయిర్ లైన్స్ (Pakistan Passports) కోరుతోంది.