Pakistan: పాకిస్థాన్‌లో 11 మంది మృతి.. గోధుమపిండి కోసం తొక్కిసలాట..!

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan)లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. దీనికి పేదలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 07:35 AM IST

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan)లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. దీనికి పేదలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ దుకాణం నుండి ఉచితంగా పిండిని పొందడం కోసం తొక్కిసలాట, ఇతర సంఘటనలలో తాజాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లోని పేదల కోసం ఉచిత పిండి పథకం అమలు చేయబడుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పంజాబ్‌లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రజాదరణను అడ్డుకోవడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. మంగళవారం కూడా ఉచిత పిండి కోసం గుమికూడిన జనంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు వృద్ధులు, ఓ వ్యక్తి మృతి చెందారు.

Also Read: World Cup 2023: పాక్ కోసం బాంగ్లాదేశ్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఇది నిజమేనా..?

దక్షిణ పంజాబ్‌లోని సాహివాల్, బహవల్‌పూర్, ముజఫర్‌ఘర్, ఒకారాలో జరిగిన తొక్కిసలాటలో మరో 60 మంది గాయపడ్డారు. ఫైసలాబాద్, జెహానియన్, ముల్తాన్ జిల్లాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ప్రజాపంపిణీ కేంద్రాల వద్ద పెద్దఎత్తున జనం గుమికూడుతున్నారంటూ పాకిస్థాన్‌లో వరదల కారణంగా ఏర్పడిన విధ్వంసమే ఇందుకు కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు.