Site icon HashtagU Telugu

Pakistan Protest: పాకిస్థాన్‌లో ఉవ్వెతున బలూచ్ ఉద్యమం

Pakistan Protest

Pakistan Protest

Pakistan Protest: పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వర్గానికి చెందిన ప్రజలను అక్రమంగా చంపడం మరియు బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది మహిళలు మరియు పిల్లలు ఇస్లామాబాద్‌ని చుట్టుముట్టి నిరసనలో పాల్గొన్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్‌ను వేరు చేయడానికి కుట్రగా అభివర్ణిస్తోంది.

బలూచ్ ఉద్యమం పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ ఈ ఉద్యమాన్ని భారతదేశం నిధులతో ఉద్యమిస్తున్నారని అభివర్ణించారు. ఇది బంగ్లాదేశ్ ఏర్పాటు తరహా కుట్రగా అభివర్ణించిన అన్వరుల్.. దేశాన్ని విభజించడానికే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

ఉద్యమ ప్రధాన నాయకురాలు మెహ్రాంగ్ బలోచ్ ఇస్లామాబాద్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి నిరసన స్థలం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఎంబీబీఎస్ చదివిన మెహ్రంగ్ బలోచ్ వయసు కేవలం 30 ఏళ్లే అయినా బలూచ్ యువతతో పాటు పెద్దల్లో కూడా ఆమెకు మంచి పేరుంది. మెహ్రాంగ్ బలోచ్ తండ్రిని డిసెంబరు 2009లో సైన్యం కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత హత్య చేశారు.

Also Read: Vastu Tips: ఉదయం లేవగానే ఆ ఐదు రకాల పనులు చేస్తున్నారా.. అయితే దారిద్యం పట్టిపీడించడం ఖాయం?