Pak Nuclear Bombs: భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. ఇప్పటికే ఇరుదేశాల సైన్యాలు పరస్పరం వైమానిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసుకున్నాయి. తదుపరిగా ఇంకా ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ భయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశమయ్యారు. ఈ సంస్థే పాకిస్తాన్ అణుబాంబుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది.
Also Read :Srinagar Explosions: శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై పాక్ దాడి.. దాల్ లేక్‌లో మిస్సైల్ పేలుడు
ఈ మీటింగ్.. ఎందుకు ?
ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు జరిగింది ? అంటే.. భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉన్న సైనిక స్థావరాలు లక్ష్యంగా లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో పాకిస్తాన్ దాడికి యత్నించింది. అయితే ఆ మిస్సైల్‌ను భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది. ఈ దాడికి యత్నించినందుకు ప్రతీకారంగా వెంటనే భారత సైన్యం(Pak Nuclear Bombs) పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్, చక్వాల్‌లో ఉన్న మురిద్, షోర్కోట్‌లో ఉన్న రఫిఖీ సహా మొత్తం నాలుగు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ చేసిన ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ రగిలిపోతోందట. ఈక్రమంలోనే ఈరోజు హుటాహుటిన నేషనల్ కమాండ్ అథారిటీతో పాక్ ప్రధానమంత్రి షాబాజ్ భేటీ అయ్యారట. యుద్దాన్ని ఆపాలనే ఆలోచనే ఉంటే.. శాంతిచర్చల కోసం షాబాజ్ ప్రయత్నించి ఉండేవారు. అణుబాంబుల పర్యవేక్షక విభాగంతో మీటింగ్ నిర్వహించారంటేనే.. పాకిస్తాన్ మనసులో ఏముందో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read :Operation Sindoor Movie : ‘ఆపరేషన్ సిందూర్’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?
పరువు పోగొట్టుకుంటున్న పాక్
ఉగ్రవాద సంస్థలకు నిలయంగా మారి.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ఇప్పటికే పాకిస్తాన్ ప్రతిష్ఠ మంటకలిసింది. ఇప్పుడు అణుబాంబుల లాంటి సున్నిత అంశంపై తొందరపాటుతో పాకిస్తాన్ ప్రధానమంత్రి మీటింగ్ పెట్టారు. దీనివల్ల పాకిస్తాన్ పాలకులపై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోతుంది. పాక్ లాంటి దేశాలకు ఆర్థికసాయం చేస్తే ప్రపంచం ఉనికికే ముప్పు అని అవి గ్రహిస్తాయి. ప్రపంచ పటంలో ఉండే అర్హత పాకిస్తాన్‌కు లేదనే నిర్ణయానికి వస్తాయి.