Site icon HashtagU Telugu

Pakistan : అమెరికా అధ్యక్షుడి ప్రకటన విని…బిత్తరపోయిన పాకిస్థాన్.. పూర్తిగా అవాస్తవం అంటూ!!

Biden Visits

Joe Biden

పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో సమన్వయం లేకుండానే పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగి ఉందని బైడెన్ అన్నారు. అవి టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. జోబైడెన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బైడెన్ చేసిన ప్రకటనను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కొట్టిపారేశారు.

బైడెన్ ప్రకటన వాస్తవం కాదు..తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. పాకిస్తాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణుదేశంగా నిరూపించబడిందన్నారు. అణ్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక అంతా సురక్షితంగా ఉందని పూర్తిగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నడుస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ కూడా అణ్వాయుధాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహారిస్తోందని షరీఫ్ అన్నారు.

పాకిస్తాన్ అణ్వాయుధాలపై జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు తనను దిగ్బ్రాంతికి గురిచేశాయని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో జర్దారీ అన్నారు. పాక్ ప్రధాని షరీఫ్..అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకుని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలనీ ప్రయత్నిస్తున్న తరుణంలో జోబైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి మింగుపడటం లేదు.