Red Carpets Ban : పాకిస్తాన్‌లో రెడ్ కార్పెట్‌పై బ్యాన్.. ఎందుకో తెలుసా ?

Red Carpets Ban : పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నా..  ఆర్థికం లేదు.  ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

  • Written By:
  • Updated On - March 31, 2024 / 07:58 AM IST

Red Carpets Ban : పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నా..  ఆర్థికం లేదు.  ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, చైనా నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక పాక్ విలవిలలాడుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి జనం ఇక్కట్లు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రభుత్వ శాలరీ తీసుకునేది లేదని స్పష్టం చేశారు. తాజాగా పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఆ బాటలోనే నడిచారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రెడ్ కార్పెట్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఈమేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.  కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారుల పర్యటనల సందర్భంగా రెడ్‌ కార్పెట్‌లను వాడొద్దని తేల్చి చెప్పారు. అయితే  విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం రెడ్ కార్పెట్‌ల(Red Carpets Ban) వినియోగం మునుపటిలాగే కంటిన్యూ అవుతుందని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే తమ శాలరీలు, ఇతర భత్యాలను వదులుకుంటామని.. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, కేంద్ర క్యాబినెట్ సభ్యులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join

2023 సంవత్సరంలో పాకిస్తాన్ తన చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ మరోసారి పెట్రోల్ ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతోంది.  నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ ధరలు పెరిగిపోయి దేశ ప్రజానీకం అవస్థలు పడుతున్నారు. ఆదాయాలు పెరగకపోగా.. ఖర్చులు పెరగడంతో ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి ప్రజలపై భారం మోపేందుకు షహబాజ్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే రెండు వారాల్లో పెట్రోల్ ధరల్ని పాకిస్తాన్ సర్కారు  మరోసారి పెంచనున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోలు ధర లీటరుకు  రూ. 10 చొప్పున పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పాకిస్తాన్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 279.75 ఉండగా.. ఇది రూ. 289.69కి పెరిగే అవకాశం ఉంది. కిరోసిన్ ధర లీటర్‌కి రూ. 188.66 నుంచి రూ. 188.49కి స్వల్పంగా తగ్గుతుంది. లైట్ డీజిల్ ధర రూ. 168.18 నుంచి రూ. 168.63కి పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వల్ల స్థానికంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. మార్చి మొదటి పక్షంలో బ్యారెల్ ధర 90 డాలర్లు ఉంటే ఇది ఇప్పుడు 95 డాలర్లకు పెరిగింది.

Also Read :Daniel Balaji: చనిపోయి కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ?