Pakistan Parliament: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు ప్రధాని షెహబాజ్ ప్రకటించారు. రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ అర్ధరాత్రి పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు. షాబాజ్ ప్రభుత్వం రద్దైన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టనుంది.
పార్లమెంటును రద్దు చేయడం అంటే దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్టే. జాతీయ అసెంబ్లీ పదవీకాలం పూర్తయితే ఎన్నికల సంఘం రెండు నెలల్లోగా దేశంలో ఎన్నికలను నిర్వహించాలి. ఒకవేళ గడువు ముగియకుండానే అసెంబ్లీని రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవైపు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. మరోవైపు మరో మూడు నెలల్లో అక్కడ సాధారణ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం ఏం చేస్తుంది?
దేశాన్ని సక్రమంగా నడిపేందుకు కృషి చేస్తుంది.
దేశంలో ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల పట్ల నిష్పక్షపాతంగా పని చేస్తుంది.
ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయా?
దేశంలోని ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకోరు.
ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు.
అంతర్జాతీయ చర్చల్లో పాల్గొనరు.
అంతర్జాతీయ ఏంఓయూపై సంతకం చేయరు
దేశంలోని కీలక ప్రభుత్వ అధికారులను బదిలీ చేయలేరు.
Also Read: Telangana Boxer: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా, నిఖత్ జరీన్ కు థార్ కారు గిఫ్ట్