Shocking: పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధిగా చెప్పుకునే ఇస్లామాబాద్‌లోని పిమ్స్ (PIMS) హాస్పిటల్ తాజాగా అమానుష ఆరోపణలతో తీవ్ర దుమారం రేపుతోంది. డబ్బు కోసం ఒక రోగి మృతి చెందిన తర్వాత కూడా ఆయన శవాన్ని ఐసీయూలో ఉంచి, ఏకంగా ఏడు రోజుల పాటు కుటుంబసభ్యుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అసెంబ్లీ కమిటీ వేదికగా బయటపడ్డ దారుణం
ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆరోగ్య ఉపసంఘం సమావేశంలో కమిటీ సభ్యురాలు షైస్తా ఖాన్ బయటపెట్టారు. ఆమె ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక రోగి మరణించాడు. కానీ ఆసుపత్రి యాజమాన్యం ఆ మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి, మృతుడి కుటుంబసభ్యులకు అది తెలియనివ్వకుండా రోజుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ఏడు లక్షలు వసూలు చేసినట్లు షైస్తా ఖాన్ ఆరోపించారు.
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
నైతిక పతనం, పర్యవేక్షణ లోపం
ఈ ఆరోపణలు ప్రైవేట్ వైద్య రంగంలో పర్యవేక్షణ లోపాలను, వ్యాపార లక్ష్యాల కోసం నైతిక విలువలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చూపిస్తున్నాయి. ఆసుపత్రులు రోగులకు చికిత్స ఇవ్వాల్సిన స్థలాలు కావాలే గానీ, లాభాల కోసమే పనిచేసే కేంద్రాలుగా మారిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ అవి పూర్తిగా నిరాధారమని ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమగ్ర విచారణపై డిమాండ్లు
ఈ అమానుష ఘటనపై నెటిజన్లతోపాటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనీ, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని పలువురు నేతలు కూడా కోరుతున్నారు.
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…