Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ

ధిక్కార కేసులో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), అతని సహాయకులకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP), చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Imran Khan

Imran Khan

ధిక్కార కేసులో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), అతని సహాయకులకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP), చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసున్నాయి. నిసార్ దుర్రానీ నేతృత్వంలోని నలుగురు న్యాయమూర్తుల బెంచ్.. ఖాన్, అతని సన్నిహితులు ఫవాద్ చౌదరి, అసద్ ఉమర్‌లపై వారెంట్లు జారీ చేసింది.

గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ధిక్కార అధికారాలను ఉపయోగించి వారిపై ఎన్నికల సంఘం గతంలో నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌కు (పీఎమ్‌ఎల్-ఎన్) అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమీషన్‌ను, సికిందర్ సుల్తాన్ రాజా పిటిఐ నేతలు పదే పదే దూషించడంతో.. ఈసీపీ గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధిక్కార అధికారాలను వినియోగించుకుని వారిపై నోటీసులు జారీ చేసింది. తమది పక్షపాత విధానమని స్పష్టం చేసింది.

Also Read: Prithvi-II Missile Successfull: మరో అద్భుత అస్త్రం.. పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం

గత విచారణలో ECP.. PTI నేతలకు హాజరయ్యేందుకు చివరి అవకాశం ఇచ్చింది. మంగళవారం విచారణ సందర్భంగా హాజరు నుండి మినహాయింపు కోసం వారి అభ్యర్థనను కమిషన్ తిరస్కరించింది. ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల పూచీకత్తుతో పాటు వారిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. విచారణను ధర్మాసనం జనవరి 17కి వాయిదా వేసింది. ఎన్నికల సంఘం తటస్థ పాత్ర పోషించడంలో విఫలమైందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తూ ECP చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీపీ చీఫ్ వారి డిమాండ్‌ను తోసిపుచ్చారు.అయితే తాను చట్ట ప్రకారమే పనిచేస్తున్నానని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ చెబుతున్నారు.

  Last Updated: 11 Jan 2023, 07:30 AM IST