Pakistan Election: 2024 ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు (Pakistan Election) జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలపై తీవ్రవాద ఛాయలు అలుముకున్నాయి. ఓటింగ్‌కు ముందు నుంచే ఎన్నికల అభ్యర్థులపై దాడులు పెరిగిపోయి హత్యలకు గురవుతున్నారు. పెషావర్‌లో బుధవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థిని కాల్చి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ నేతల్లో ఆందోళన పెంచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికలకు తీవ్రవాద దాడుల వల్ల ముప్పు ఏర్పడవచ్చు.
అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్షియల్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థి మాలిక్ కలీమ్ ఉల్లాతో సహా ముగ్గురు వ్యక్తులు బుధవారం మరణించారని రాయిటర్స్ నివేదించింది. నార్త్ వజీరిస్థాన్ పోలీసు చీఫ్ రోహన్ జైబ్ ఖాన్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కలీమ్ ఉల్లా తనపై దాడి చేసినప్పుడు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గ్రూపు దాడికి బాధ్యత వహించలేదు.
Also Read: Narayana Murthy: టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఎప్పుడంటే..?
నవాజ్ షరీఫ్ పై కూడా దాడి
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా దాడి జరిగింది. బలూచిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML-N) జాతీయ అసెంబ్లీ అభ్యర్థి మీర్ అస్లాం బులేడి సాయుధ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్ర నీడలో ఎన్నికలు
సుదీర్ఘ రాజకీయ గందరగోళం, జాప్యం తర్వాత పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరుగుతాయని ప్రకటించారు. దాదాపు 24 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్.. కఠిన చట్టాలను డిమాండ్ చేసే ఇస్లామిక్ ఉగ్రవాదులకు కంచుకోట. 2022 చివరిలో పాకిస్తాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తీవ్రవాద సంస్థలు దాడులను తీవ్రతరం చేశాయి.
We’re now on WhatsApp. Click to Join.