Site icon HashtagU Telugu

Pakistan cop: పోలీస్ అధికారి ఖాతాలోకి రూ.10 కోట్లు..!

Cropped (2)

Cropped (2)

మనలో చాలా మందికి మరచిపోయిన ప్యాంట్ జేబులో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో రూ. 50 లేదా 100 కనపడితేనే ఎంతో సంతోషిస్తాం.
అయితే పాకిస్తాన్‌లోని ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా రూ 10 కోట్లు వ‌చ్చిపడ్డాయి. అత‌డి ప‌రిస్ధితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ పోలీస్ అధికారి ఖాతాలో రూ. 10 కోట్లు జమయ్యాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని పోలీస్ ఆఫీసర్ ఆమీర్ గోపంగ్ తెలిపాడు. బ్యాంక్ అధికారులు తన ఖాతాను స్తంభింపచేయడంతో పాటు ఏటీఎం కార్డును బ్లాక్ చేశారని వెల్లడించాడు. మరో ఇద్దరు అధికారుల ఖాతాలో కూడా రూ.5 కోట్లు జమ అయినట్లు వెల్లడించాడు.

“ఇంత డబ్బును చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా ఖాతాలో కొన్ని వేల రూపాయల కంటే ఎక్కువ ఎప్పుడూ లేవు” అని గోపాంగ్ తెలిపారు. బ్యాంకు అధికారులు త‌న‌కు కాల్ చేసి త‌న ఖాతాలో రూ. 10 కోట్లు డిపాజిట్ అయ్యాయ‌ని చెప్ప‌డంతోనే త‌న‌కు ఈ విష‌యం తెలిసింద‌ని అన్నాడు. బ్యాంక్ అధికారులు గొపాంగ్ ఖాతాను ఫ్రీజ్ చేయ‌డంతో పాటు డ‌బ్బు విత్‌డ్రా చేయ‌కుండా అత‌డి ఏటీఎం కార్డును కూడా బ్లాక్ చేశారు. క‌రాచీ పోలీస్ ఖాతాలోకి ఇంత పెద్ద‌మొత్తం ఎక్క‌డి నుంచి ఎలా వ‌చ్చిప‌డిందో తెల‌సుకునేందుకు అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పాకిస్తాన్‌లోని లర్కానా, సుక్కూర్‌లలో కూడా గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇతర పోలీసు అధికారులు కూడా వారి బ్యాంకు ఖాతాలలో పెద్ద మొత్తంలో డబ్బు పొందారు.