Site icon HashtagU Telugu

Pakistan : ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్లీన్ స్వీప్..!!

Imran Khan

Imran Khan

పాకిస్తాన్ లో ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఏడు స్ధానాల్లో పోటీ చేశాడు. అందులో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇదేకాకుండా ప్రావిన్షియల్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకుంది.దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి శుభవార్త అందించినట్లయ్యింది. ఎందుకంటే త్వరలోనే పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఇవి సెమీ ఫైనల్ గా పరిగణిస్తారు.

కాగా ఈ ఉపఎన్నికల్లో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ కు నిరాశే ఎదురైంది. పార్టీ ఒక ప్రావిన్షియల్ అసెంబ్లీ సీటును మాత్రమే గెలిచింది. మిగిలిన స్థానాల్లో పిటిఐ కంటే వెనకబడి ఉంది. కాగా ఈ ఉపఎన్నికలు 8 జాతీయ అసెంబ్లీస్థానాలు, మూడు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వీటిలో చాలా స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ముందజలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో అధికారం కోల్పోవల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఉపఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ తన బలాన్ని నిరూపించుకుంటున్నారు.

Exit mobile version