Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్థాన్‌లో విదేశీ దౌత్యవేత్తల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి, పోలీసు మృతి

Pakistan

Pakistan

Pakistan:  పాకిస్థాన్‌లోని 11 దేశాల దౌత్యవేత్తల కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని స్వాత్ జిల్లా నుంచి మలమ్ జబ్బాకు వెళ్తున్న విదేశీ రాయబారుల కాన్వాయ్‌కు రక్షణగా ఉన్న పోలీసు వ్యాన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు రిమోట్‌ కంట్రోల్‌ బాంబుతో వ్యాన్‌ను పేల్చివేశారు. ఈ పేలుడులో ఓ పోలీసు అధికారి మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సైదులు షరీఫ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

పాకిస్థాన్ (pakistan) వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తున్న విదేశీ దౌత్యవేత్తల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని స్వాత్ జిల్లాలో స్కౌట్ పోలీసు వాహనంపై ఐఈడీ (IED) పేలిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మింగోరాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఓ కార్యక్రమం ముగించుకుని దౌత్యవేత్తలు మాలం జబ్బాకు వెళ్తుండగా షెరాబాద్ శివారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి భవన్ నుండి విడుదలైన ఒక ప్రకటన ప్రకారం ఆసిఫ్ అలీ జర్దారీ దాడిలో మరణించిన పోలీసుకు నివాళులర్పించారు. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రార్థిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న పోలీసు వాహనం 11 మంది విదేశీ దౌత్యవేత్తలతో కూడిన కాన్వాయ్‌లో ముందువరుసలో ఉంది. ఈ దాడిలో బుర్హాన్ అనే పోలీసు మరణించాడు. గాయపడిన ముగ్గురిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నట్లు సమాచారం. రాయబారులందరూ క్షేమంగా ఉన్నారు. అతడిని ఇస్లామాబాద్‌కు పంపించారు. కాగా దౌత్యవేత్తల బృందం సురక్షితంగా ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చినట్లు జిన్హువా వార్తా సంస్థ ప్రకటనను ఉటంకిస్తూ పేర్కొంది. విదేశాంగ కార్యాలయం మాట్లాడుతూ..ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ నిబద్ధత నుంచి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డుపడవని పేర్కొంది.

Also Read: PM Modi : ‘‘భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే’’.. ఎన్నారైల సమావేశంలో ప్రధాని మోడీ

Exit mobile version