Site icon HashtagU Telugu

Hindu Woman Killed: పాకిస్థాన్‌లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు

Son Killed Father

Crime Scene

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని సింధ్రో పట్టణంలో దయా భిల్ అనే హిందూ మహిళ శిరచ్ఛేదం చేసి పొట్టనబెట్టుకున్నారు. మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారని పాకిస్థాన్ తొలి మహిళా హిందూ సెనేటర్ కృష్ణ కుమారి తెలిపారు.
మైనారిటీలకు రక్షణ కల్పించాలని భారత్‌ గురువారం పాకిస్థాన్‌ను హెచ్చరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. మేము దాని గురించి నివేదికలను చూశాము. అయితే ఈ విషయంపై మాకు నిర్దిష్ట వివరాలు లేవు. పాకిస్తాన్ తన మైనారిటీలను రక్షించాలని మేము పునరుద్ఘాటిస్తున్నాము అన్నారు.

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బుధవారం నాడు 40 ఏళ్ల హిందూ మహిళను దారుణంగా హత్య చేసి (Hindu Woman Killed), తలను వేరు చేశారు. ఈ ఘటన సింజోరో జిల్లాలో చోటుచేసుకుంది. దయా భిల్ అనే హిందూ మహిళ వితంతువు, భిల్ కమ్యూనిటీకి చెందినది. ఆమెకి నలుగురు పిల్లలు. థార్‌పార్కర్ సింధ్‌కు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ కృష్ణ కుమారి ఆ గ్రామానికి చేరుకుని హిందూ మహిళ దారుణ హత్య వార్తను ధృవీకరించారు.

Also Read: Israel New Prime Minister: ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నెతన్యాహు

హిందూ మహిళ దయా భీల్ దారుణ హత్యకు గురికావడంతో పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సెనేటర్ కృష్ణ కుమారి ట్వీట్ చేస్తూ.. దయా భీల్ అనే 40 ఏళ్ల వితంతువు దారుణంగా హత్య చేయబడింది. ఆమె మృతదేహం చాలా దారుణమైన స్థితిలో కనుగొనబడింది. ఆమె తల శరీరం నుండి వేరు చేయబడింది. క్రూరులు మొత్తం తల నుండి మాంసాన్ని తొలగించారు. ఘటన స్థలానికి పోలీసు బృందాల సహాయంతో చేరుకున్నా అని పేర్కొంది.