61 Migrants Died : ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌కు ప్రజల వలసలు ఆగడం లేదు. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం కారణంగా ప్రజలు ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో అనుమతులు లేకుండా అక్రమంగా సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఎంతోమంది ఆఫ్రికన్లు చనిపోతున్నారు.తాజాగా ఆఫ్రికా దేశం లిబియాలో మరో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లిబియాలోని జ్వారా నగరం నుంచి బయలుదేరిన పడవ.. మధ్యధరా సముద్రాన్ని దాటుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దీంతో 61 మంది వలసదారులు చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే అని సమాచారం. పడవలోని మరో 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పడవలో పరిమితికి మించి జనాలు ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంటున్నారు. 20 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న పడవలో 60 నుంచి 70 మందిని ఎక్కించడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఆఫ్రికా నుంచి సముద్ర మార్గంలో యూరప్‌కు వెళ్లాలంటే లిబియానే ప్రధాన కేంద్రం.
We’re now on WhatsApp. Click to Join.
- ఈ ఏడాది ఫిబ్రవరిలో తుఫాను సమయంలో ఇటలీలోని కాలాబ్రియన్ తీరంలో వలసదారుల పడవ బండరాళ్లను ఢీకొని 96 మంది మరణించారు.
- ఈ ఏడాది జూన్‌లో 79 మంది వలసదారులు సముద్రంలో మునిగిపోయారు.
- ఈ ఏడాది ఆగస్టులో ఇటలీ ద్వీపమైన లంపెదసాలో పడవ మునిగి 41 మంది ఆఫ్రికా వలసదారులు(61 Migrants Died) మరణించారు.