South African Gold Mine: దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో (South African Gold Mine) 100 మంది కార్మికులు మరణించారు. చాలా మంది మైనర్లు ఇప్పటికీ గనిలో చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలతో పాటు బతికిన మైనర్ల పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆహారం, నీరు అందడం లేదు. చనిపోయిన వారు కూడా ఆకలి, దాహంతో బాధతో చనిపోయారు. మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మైనింగ్ అఫెక్టెడ్ కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్‌గుని ఈ విషయాన్ని ధృవీకరించారు. 26 మందిని సురక్షితంగా రక్షించారని ఆయన వెల్లడించారు. బంగారం తవ్వేందుకు దాదాపు 500 మంది మైనర్లు గనిలోకి ప్రవేశించారని, గని చాలా ఏళ్లుగా మూతపడి ఉన్నందున అక్రమంగా తవ్వుతున్నారని వెల్లడించారు.
దేశంలోని లోతైన గనుల్లో ఒకదానిలో ప్రమాదం
స్టిల్‌ఫోంటైన్ పట్టణానికి సమీపంలోని బఫెల్స్‌ఫోంటైన్‌లోని బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికార ప్రతినిధి బ్రిగేడియర్ సెబాటా మోక్‌వాబోన్ తెలిపారు. వెలికితీసిన మృతదేహాల పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. ఆకలి, దాహం కారణంగా మరణించినట్లు నిర్ధారించింది. మైనర్ల మృతదేహాలను గనిలో ప్లాస్టిక్ చుట్టలు చుట్టి ఉన్నాయి. సజీవంగా ఉన్న మైనర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గతేడాది నవంబర్ నుండి మైనర్లు లోపల చిక్కుకున్నారు. సుమారు 500 మంది మైనర్లు తవ్వడానికి గనిలోకి ప్రవేశించారు.
Also Read: Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్ ఎలాన్ మస్క్ చేతికి.. ఎందుకు ?
ప్రమాదం జరిగిన గని దక్షిణాఫ్రికాలో అత్యంత లోతైన గనుల్లో ఒకటి. దీని లోతు సుమారు రెండున్నర కిలోమీటర్లు. దాని లోపల సొరంగాల చిట్టడవి ఉంది. అనేక సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. బంగారంపై అత్యాశతో అక్రమంగా గనుల్లోకి ప్రవేశిస్తున్నారు. వారు తమతో పాటు ఆహారం, నీరు, ఇతర సామగ్రిని కూడా తీసుకువెళతారు. దీని కారణంగా వారు తరచుగా ప్రమాదాలకు గురవుతారు.
రెండు నెలల క్రితం నవంబర్‌లో ఈ గనిలో అక్రమ మైనింగ్ గురించి పోలీసులకు సమాచారం అందిందని, అప్పటికి దాదాపు 500 మంది మైనర్లు అందులోకి వెళ్లారని బ్రిగేడియర్ సెబాటా మోక్‌వాబోన్ తెలిపారు. పోలీసులు వారిని బలవంతంగా గని నుండి బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ అందరూ బయటకు రాలేకపోయారు. అప్పటి నుంచి పోలీసులకు, మైనర్లకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. పోలీసుల చర్యకు భయపడి మైనర్లు బయటకు రాలేదని ప్రాథమిక సమాచారం.