Bashar al-Assad: సిరియాలో తిరుగుబాటు తర్వాత మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మాస్కోలో నివసిస్తున్నారు. అసద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ రష్యా రాజకీయ ఆశ్రయం ఇచ్చింది. ఇటీవల అసద్‌ను హతమార్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్ వార్తాపత్రిక ది సన్‌లో పేర్కొంది. నివేదిక ప్రకారం.. డిసెంబర్ 29న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని అసద్ ఫిర్యాదు చేశారు. దీని తర్వాత అతను దగ్గడం ప్రారంభించాడు. అతని పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభించింది. వైద్యులు చికిత్స నిమిత్తం వచ్చేసరికి పరిస్థితి విషమంగా ఉంది. సిరియా మాజీ నియంతపై విష ప్రయోగం జరిగినట్లు వార్తాపత్రిక పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్- అసద్ మధ్య వివాదం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బషర్ అల్ అసద్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇద్దరు నేతలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేదు. అయితే గత నెలలో సిరియాలో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులతో సహా అసద్‌ను మాస్కోకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతను రష్యాలో నివసిస్తున్నాడు. అలాంటి సమయంలో విషం కలిపి చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై రష్యా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన లేదు. దీనిపై పుతిన్‌కు సమాచారం అందించామని, దీనిపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
Also Read: Astrology : ఈ రాశివారు నేడు వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి..!
అసద్ భార్యతో కూడా వివాదం నడుస్తోంది
సిరియాలో అధికారం నుండి తొలగించబడిన తరువాత మాజీ నియంత బషర్ అల్-అస్సాద్ అనేక రంగాలలో పోరాడుతున్నాడు. దేశం విడిచి రష్యాలో అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అసద్ భార్య అస్మా అతనికి విడాకులు ఇవ్వాలని కోరుతున్నట్లు మీడియా నివేదికలలో పేర్కొన్నారు. బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్ ప్రకారం.. అస్మా ఇంగ్లాండ్‌లో జన్మించినందున సిరియాను విడిచిపెట్టిన తర్వాత బ్రిటన్‌కు వెళ్లాలని కోరుకుంది. ప్రస్తుతం అసద్ కుటుంబం మాస్కోలో ఆశ్రయం పొందుతుంది. అయితే అస్మా ఇప్పుడు అసద్ నుండి విడిపోవాలనుకుంటున్నారని, త్వరలో విడాకులు తీసుకోవచ్చని నివేదిక పేర్కొంది.