Donald Trump భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పంచుకుంది. “మీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రజల తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు” అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.
- భారతీయులకు విషెస్ చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- నేడు భారత రిపబ్లిక్ డే
- ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతామని వెల్లడి
- ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య చారిత్రక బంధం ఉందన్న ట్రంప్
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను చాటుతూ దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పరేడ్, దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు.
