Site icon HashtagU Telugu

Colombia Accident : కొలంబియాలో ఘోర బస్సు ప్రమాదం…20 మంది దుర్మరణం..!!

Mexico Bus Crash

Road accident

సౌత్ అమెరికా కొలంబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బస్సు మెకానికల్ సమస్యతో ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అదృష్టవశాత్తు..బస్సు కొండపై నుంచి కిందికి పడలేదు. ఇదే జరిగితే ప్రమాదం ఘోరంగా ఉండేదని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడడంతోనే రోడ్డు పక్కనే ఉన్న బారియర్‌పై ఇరుక్కుపోయింది.