Site icon HashtagU Telugu

Osama bin Laden: ఒసామా బిన్‌ లాడెన్‌ గురించి కీలక విషయాలు చెప్పిన ఒమర్ బిన్ లాడెన్.!

Jpg

Jpg

అమెరికా చేతిలో హతమైన ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఆయన కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించాడు. తన తండ్రి ఒసామా తనను టెర్రరిస్టును చేయాలని భావించాడని, ఉమర్ చిన్నతనంలో ఒసామా తనకు ఆఫ్ఘనిస్థాన్‌లో తుపాకీ శిక్షణ ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒమర్ తన తల్లితో కలిసి ఫ్రాన్స్‌లో నివసిస్తున్న బిన్ లాడెన్ పెద్ద కుమారుడు. ఆ సమయంలో తాను నిస్సహాయంగా ఉన్నానని, తన తండ్రితో గడిపిన చెడు సమయాన్ని మరచిపోయేందుకు ప్రయత్నించానని ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఒసామా బిన్ లాడెన్ తన కుక్కలపై రసాయన ఆయుధాలను ప్రయోగించాడని ఒమర్ పేర్కొన్నాడు.

తన తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తు చేసుకుంటూ.. నేనంటే తనకు అస్సలు ఇష్టం లేదని, తండ్రిగా ఉంటూ తన పనిని కొనసాగించడానికి నన్ను ఎంచుకున్నాడు. దాని కోసం నాకు శిక్షణ కూడా ఇచ్చాడు. న్యూయార్క్‌లో 9/11 ఉగ్రవాద దాడులకు కొన్ని నెలల ముందు ఏప్రిల్ 2001లో ఒమర్ ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అల్-ఖైదాలో చేరమని మా నాన్న నన్ను ఎప్పుడూ అడగలేదని, అయితే తన పనిని కొనసాగించడానికి నేనే ఎంపిక చేసుకున్నానని చెప్పాడు. నాకు ఇష్టం లేదని చెప్పడంతో లాడెన్‌ నిరాశ చెందాడు. ఒమర్‌ను తన తండ్రి తన వారసుడిగా ఎందుకు ఎంచుకున్నారని అనుకుంటున్నారని అడిగినప్పుడు.. నాకు తెలియదు. బహుశా నేను మిగిలిన వారికంటే తెలివైనవాడిని. అందుకే నేను ఈరోజు జీవించి ఉన్నానని చెప్పాడు.

మీడియా కథనం ప్రకారం.. ఒమర్ మే 2, 2011న ఖతార్‌లో ఉన్నారని, పాకిస్థాన్‌లోని సురక్షిత గృహంలో తలదాచుకున్న తన తండ్రిని US నేవీ సీల్స్ హతమార్చాయన్న వార్త విన్నప్పుడు. US నావికాదళం లాడెన్ మరణించిన 24 గంటల్లో సూపర్ క్యారియర్ USS కార్ల్ విన్సన్ నుండి అతని మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేసింది. ఒసామా మృతదేహాన్ని వాళ్లు ఏం చేశారో నాకు తెలియదని ఒమర్ చెప్పాడు. వారు అతనిని సముద్రంలో పడవేశారని వారు చెప్పారు . కానీ నేను దానిని నమ్మను. నేను మా నాన్న కోసం కన్నీళ్లు పెట్టలేదని, ద్వేషిస్తానని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒమర్ మార్చి 1981లో సౌదీ అరేబియాలో బిన్ లాడెన్ మొదటి భార్య నజ్వాకు జన్మించాడు.