Site icon HashtagU Telugu

Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం

Osama Bin Ladens Son France Social Media Posts

Osama Bin Laden : అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థను స్థాపించిన  ఒసామా బిన్ లాడెన్‌ను 2011లోనే అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్‌లో మట్టుబెట్టాయి. అయితే అతడి ఒక కుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌ 2016 సంవత్సరం నుంచి  ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. ఒమర్ భార్య పేరు జేన్ ఫెలిక్స్ బ్రౌనీ. ఆమె బ్రిటీష్ జాతీయురాలు. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఒమర్ బిన్ లాడెన్‌‌ను  ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి బ్రూనో రిటైల్లే ఆదేశించారు.

Also Read :Endangered Animals: ఆన్‌లైన్‌లో అమ్మకానికి వన్యప్రాణులు.. మాఫియా గుట్టురట్టు

2023 సంవత్సరంలో సోషల్ మీడియా వేదికగా ఒమర్ అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారికి తమ దేశంలో చోటు ఉండదని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్‌లోని నార్మండి రీజియన్ పరిధిలో ఉన్న ఓర్నే ఏరియాలో ఒమర్ నివసించేవాడని వెల్లడించారు. అయితే ఫ్రాన్స్ (Osama Bin Laden) ప్రభుత్వం ఆదేశాలు వెలువడిన అనంతరం ఒమర్ దేశం విడిచి వెళ్లిపోయాడా ? లేదా ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఫ్రాన్స్‌ను విడిచిపెడితే.. తదుపరిగా ఒమర్ ఏ దేశానికి వెళ్తాడనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Also Read :Nobel Prize : భౌతికశాస్త్రంలో జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్ లకు నోబెల్ బహుమతి

Also Read :Kashmir CM : కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ఆర్టికల్ 370కి వ్యతిరేకం ఈ ఫలితం : ఫరూక్ అబ్దుల్లా