Site icon HashtagU Telugu

One Big Beautiful Bill Act : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అసలేంటిది ? దీనివల్ల ఏం జరుగుతుంది?

Big Beautiful Bill

Big Beautiful Bill

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (One Big Beautiful Bill Act) తాజాగా అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందింది. 50-50 ఓట్లతో సమానంగా టై అయిన సమయంలో, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వేసిన నిర్ణయాత్మక ఓటుతో ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ పడినట్లు అయ్యింది. ఇది జూలై 4న ప్రతినిధుల సభ (House of Representatives) ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే, ఇది చట్టంగా మారి అధికారికంగా అమలులోకి వస్తుంది.

World Sports Journalists Day : నేడు ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ఈ బిల్లులో ప్రధానంగా ట్రంప్ పాలనకు అనుకూలమైన అంశాలపై దృష్టి సారించారు. వాటిలో పన్ను రాయితీలు (Tax Cuts), బోర్డర్ భద్రత (Border Security), రక్షణ ఖర్చులు (Defense Spending), ఎనర్జీ రంగం (Energy Expansion) మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, అధునాతన సర్వైలెన్స్ టెక్నాలజీకి సుమారు $70 బిలియన్ల నిధులు కేటాయించనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. అంతేకాక, అమెరికా రక్షణ రంగానికి $150 బిలియన్ల మేరకు బడ్జెట్ కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Xiaomi Ev cars : షియోమీ ఈవీ కార్స్ సంచలన రికార్డు.. ఒక గంటలోనే 3 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్!

ఇంకా ఈ బిల్లులో ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుగా ఇవ్వడాన్ని సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీని వల్ల పలు ఎనర్జీ ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో, అమెరికా రుణ పరిమితిని $4 ట్రిలియన్లవరకు పెంచే అవకాశం ఉంది. అయితే దీని వల్ల వచ్చే పదేళ్లలో $2.4 నుంచి $3.3 ట్రిలియన్ల వరకు అదనపు రుణభారం అమెరికా ప్రజలపై పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ బిల్లులో వైద్యం, విద్య వంటి సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులను తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కోట్లాది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరికొందరు ఈ బిల్ను ప్రశంసిస్తున్నారు.