Site icon HashtagU Telugu

Japan Vs Russia : ఖబడ్దార్ రష్యా.. అణుబాంబు వార్నింగ్స్ ఆపేయ్

Japan Vs Russia

Japan Vs Russia

Japan Vs Russia :  ఇవాళ  (ఆగస్టు 6) హిరోషిమా డే.. 

1945 ఆగస్టు 6న జపాన్ లోని  హిరోషిమా సిటీపై అమెరికా అణుబాంబుతో దాడికి తెగబడిన రోజును హిరోషిమా డేగా జపాన్ లో నిర్వహిస్తారు.  

ఈసందర్భంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా కీలక వ్యాఖ్యలు చేశారు. 

అణ్వాయుధాలను ఉపయోగిస్తామంటూ పదేపదే రష్యా చేస్తున్న బెదిరింపులను ఆయన తప్పుపట్టారు.  అలాంటి వార్నింగ్ లు మానవాళి ప్రయోజనాల దృష్ట్యా ఆమోదయోగ్యం కావన్నారు.  

అణ్వాయుధాల వల్ల జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలలో జరిగిన విధ్వంసం మళ్ళీ పునరావృతం కాకూడదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read : WhatsApp Group Admin Review : వాట్సాప్ గ్రూప్ లోనూ ఇక అడ్మిన్ రివ్యూ ఫీచర్!

“యుద్ధంలో అణు బాంబు దాడులను ఎదుర్కొన్న ఏకైక దేశంగా జపాన్.. అణు రహిత ప్రపంచం కోసం ప్రయత్నాలను కొనసాగిస్తుంది” అని ఫుమియో కిషిడా (Japan Vs Russia)  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా రష్యాపై విరుచుకుపడ్డారు. “మానవత్వం లోడ్ చేయబడిన తుపాకీతో ఆడుతోంది.. ఆ లోడ్ చేయబడిన తుపాకీ  అణ్వాయుధాలే” అని ఆయన పేర్కొన్నారు. రష్యా అణు బెదిరింపులపై గ్లోబల్ కమ్యూనిటీ ఒక్కటిగా మాట్లాడాలని కోరారు. అణ్వాయుధాల వాడకం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.  హిరోషిమా ఘటన నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. కాగా, హిరోషిమా డే ప్రోగ్రాం కు  రష్యా రాయబారిని జపాన్ ప్రభుత్వం ఆహ్వానించలేదు. అయితే రష్యా రాయబారి  హిరోషిమా స్మారక స్థలానికి వెళ్లి  పూలమాలలు వేసి.. 1945 ఆగస్టు 6న చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. 

Also read : Rakhi Festival-2 Days : ఈసారి రాఖీ పండుగ రెండు రోజులు.. ఎందుకంటే ?