Site icon HashtagU Telugu

Russia: ముగ్గురిని కాల్చి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్య..!

Shooting In Philadelphia

Open Fire

రష్యాలోని క్రిమ్స్‌క్‌ పట్టణంలో 66 ఏళ్ల వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. తుపాకీతో రోడ్డుపైకి వచ్చి ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అతడు కాల్పులకు తెగబడిన సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల్లో కనీసం ఇద్దరు దుండగుడికి తెలిసిన వారని తెలుస్తోంది. పట్టణంలోని ఓ వీధిలో నడుస్తూ ముగ్గురిని కాల్చి చంపిన వృద్ధుడు.. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వృద్ధుడు మృతి చెందాడు.

దక్షిణ రష్యాలోని క్రిమ్స్క్‌లో 66 ఏళ్ల వ్యక్తి తనను తాను చంపుకోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపాడు అని స్థానిక అధికారులు తెలిపారు. బాధితుల్లో కనీసం ఇద్దరు దుండగుడికి తెలిసిన వారని రష్యాలోని ప్రధాన నేరాలను విచారించే ఇన్వెస్టిగేటివ్ కమిటీ స్థానిక శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

వృద్ధుడు.. ఇద్దరు పరిచయస్తులను వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే కాల్చిచంపినట్లు తెలుస్తోంది. మూడవ బాధితుడి గుర్తింపు ఇంకా తెలియలేదు. క్రిమ్స్‌క్‌ అనేది రష్యా దక్షిణ క్రాస్నోడార్ ప్రాంతంలో క్రిమియన్ ద్వీపకల్పానికి సమీపంలో ఉన్న ఒక చిన్న నగరం. దీనిని రష్యా ఏకపక్షంగా 2014లో ఉక్రెయిన్ నుండి కలుపుకుంది. ఇది భారీ వాణిజ్య సముదాయాలకు గుర్తింపు పొందింది. కాల్పులకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

https://twitter.com/i/status/1595867856117567488

 

Exit mobile version