Earthquake : భారీ భూకంపం…రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు..!!

మెక్సికోలో అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 05:24 AM IST

మెక్సికోలో అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అదే సమయంలో మైకోకాన్ తీరానికి సమీపంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అమెరికన్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.05గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. దీని కేంద్రం మిచోకాన్ రాష్ట్రంలోని లా ప్లాసిటా డి మోరెలోస్ నగరంలో కేంద్రీక్రుతి అయినట్లు చెప్పారు.

కాగా మొన్న తైవాన్ లనూ మూడుసార్లు భూకంపం సంభవించింది. ఈ భూకంపాల దృష్ట్యా జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న టైటుంగ్ కౌంటీలో భూకంపాల కేంద్రం కనిపిస్తోందని తైవాన్ వాతావరణ బ్యూరో తెలిపింది. శనివారం 6.4, ఆదివారం 6.8అదే రోజు మధ్యాహ్నం 7.2తీవ్రతతో మూడు సార్లు భూకంపం సంభవించింది.