ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఊబకాయం సమస్య కూడా ఒకటి. పురుషులతో పోల్చుకుంటే ఎక్కువగా స్త్రీలు ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఊబకాయం కారణంగా చాలామంది వారి పని వారే కూడా చేసుకోలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రమంగా ఊబకాయం సమస్య ప్రపంచ సమస్యగా మారింది. ఒక సర్వే ప్రకారం ఊబకాయంతో బాధపడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు.
ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు ముందుగా ఉన్నారు. ఈ ఊబకాయంలో ఉత్తర ఆఫ్రికాలోని పురుషులు,స్త్రీల మధ్య అనేక తేడాలు ఉన్నాయట. దక్షిణాఫ్రికాలోని అనేక దేశాల్లో కూడా ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మహిళల్లో ఊబకాయల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇందుకు గల కారణం ఆయా దేశాల్లోని మహిళలు ఎక్కువగా శారీరక శ్రమ చేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరాన్ లోని బాగ్దాద్ లో నివసించే ఒక మహిళ బరువు 150 కిలోలు. ఆమెకు నలుగురు కూతుర్లు కాగా వారిలో ఎవరూ పని చేయడం లేదు.
త్వరలో వారు కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కూతుర్లను పనికి పంపడం వల్ల మగవారి వేధింపులకు గురవుతారు అని భయపడి బయటకు పంపించడం లేదు సదరు మహిళ. దాంతో ఆ అమ్మాయిలు బయటకు వెళ్లి పని చేయరు. ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేస్తుంటారు. కేవలం వారు మాత్రమే కాకుండా అరబ్ దేశంలో చాలామంది ఆడవారు నడకకు కూడా వెళ్ళకపోవడం ఆహారంగా పరిమితులు లేకపోవడం వంటి పరిస్థితుల కారణంగా అధిక బరువు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.
ఉదయం నిద్ర లేచి మంచం మీద నుండి కాలు కింద పెట్టినప్పుడు నుండి తిరిగి రాత్రి మంచం మీదకు చేరేంతవరకు నిత్యజీవితంలో మనిషి కావాల్సిన అన్ని విషయాలను సౌకర్యాలు పెరిగిపోవడంతో మనుషులు చేసే ప్రతి పనిని యంత్రాలు పూర్తిగా చేసేస్తున్నాయి. దాంతో మనిషి కావాల్సిన శారీరక శ్రమ తగ్గిపోయింది. మగవారు వృత్తి వ్యాపారం ఆహారం పనిచేసే విధానం ఇలా కొన్ని కారణాలవల్ల మహిళతో పోల్చుకుంటే బరువు తక్కువగా ఉంటున్నారు.