Site icon HashtagU Telugu

Johnnie Moore: భారత్ నుండి అమెరికా చాలా నేర్చుకోవాలి: యూఎస్ మాజీ కమిషనర్

Johnnie Moore

B35cd464 Eaf0 4130 Ad90 3f3d1e43c725

Johnnie Moore: భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ దేశాలలో మన దేశానికి ప్రత్యేకత ఉంది. అత్యంత వైవిధ్యమైన దేశం మనది. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలకు నిలయం ఈ దేశం. ప్రపంచంలోని చరిత్రకారులు భారతదేశాన్ని గొప్పగా వర్ణించారు. ఒకే ప్రజాస్వామ్యంలో అనేక భాషలు, మతాలు మరియు విభిన్న వ్యక్తులు ఈ నేల సొంతం. అయితే భారతదేశం అమెరికా కంటే గొప్ప దేశంగా పేర్కొన్నారు యూఎస్ మాజీ కమిషనర్ జానీ మూర్.

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ మాజీ కమిషనర్ జానీ మూర్ మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌ను విమర్శించడం కంటే ప్రశంసించడానికే ఎక్కువ శక్తిని వెచ్చించాలన్నారు. మానవ చరిత్రలో భారతదేశం అత్యంత వైవిధ్యమైన దేశమని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని అమెరికా అభినందించాలని జానీ మూర్ అన్నారు. అమెరికా పరిపూర్ణ దేశం కాదని వ్యాఖ్యానించారు.

భారత్ నుండి అమెరికా చాలా నేర్చుకోవచ్చు. భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అత్యంత బహుళత్వం కలిగిన దేశం. ఇది మతాల ప్రయోగశాల. నేను మతం గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి వెళ్ళాను మరియు భారతదేశం గురించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఒకే ప్రజాస్వామ్యంలో ఎక్కువ భాషలు, ఎక్కువ మతాలు మరియు విభిన్న వ్యక్తులు ఉన్నారని తెలిపారు.

Read More: Prithviraj Sukumaran: సాలార్ నటుడికి యాక్సిడెంట్, 3 వారాలు రెస్ట్