Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అనేక మంది అమాయక ఇజ్రాయిలీలను చంపిన దాడిని ఖండించడమే కాకుండా పాలస్తీనాలోని పౌరుల బాధలను కూడా గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత రక్తపాతంలో ప్రతి ఒక్కరూ కొంతవరకు భాగస్వామ్యులు అని , ఈ వివాదం శతాబ్దాల నాటి విషయమని చెప్పారు. ఇదిలా ఉండగా హమాస్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్‌కు బలమైన సైనిక సహాయాన్ని అందించాడు.
అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ దాడుల్లో 9,488 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో 1,400 మందికి పైగా మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించదని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. పెరల్ హార్బర్‌పై బాంబు దాడి తర్వాత లేదా 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత యునైటెడ్ స్టేట్స్ కాల్పుల విరమణకు అంగీకరించనట్లే. అక్టోబరు 7 నాటి భయంకరమైన దాడుల తర్వాత శత్రుత్వాల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించదని నొక్కి చెప్పారు.
Also Read: KTR – Gangavva : గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన కేటీఆర్.. వీడియో వైరల్