Site icon HashtagU Telugu

Kim Jong Un: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ కన్నీళ్లు

Pri 168381111

Pri 168381111

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని వారుండరు. తన కఠిన చర్యలతో దేశ ప్రజలను తన అధీనంలో ఉంచుకున్న నియంత. ఎవరైనా తన ఆదేశాలను భేఖాతర్ చేస్తే నరకాన్ని మించిన శిక్షలు విధిస్తారు. దేశం కరువుతో అల్లాడిపోతున్నా, దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి దేశ ప్రజల ముందు ఏడ్చాడు. తనతోపాటు దేశాన్ని ఏడిపించాడు. ఉత్తర కొరియా జననాల రేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. దేశంలోని మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరుతూ కిమ్ జాంగ్ కన్నీరుమున్నీరుగా విలపించారు.

గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండడంతో.. తాజాగా ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. జననాల రేటు తగ్గకుండా నిరోధించడంతోపాటు పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. వారికి కూడా మంచి విద్యను అందించాలి. ఇందుకోసం దేశంలోని ప్రతి తల్లితో కలిసి పనిచేయాలని మా ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. అలాగే.. జాతీయ శక్తిని బలోపేతం చేసేందుకు తల్లులందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయన కంటతడి పెట్టారు. ఆయన ప్రసంగం విన్న మహిళలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కిమ్ జాంగ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Elbow Darkness: మోచేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే?