Site icon HashtagU Telugu

kim jong un : ప్రపంచంలో అత్యంత బలమైన అణుశక్తిగా ఎదగడమే ఉత్తర కొరియా లక్ష్యం..!!

Kim Jong Un

Kim Jong Un

ప్రపంచంలోని అత్యంత బలమైన అణుశక్తిని సొంతం చేసుకోవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యంత బలమైన వ్యూహాత్మక ఆయుధంగా హ్వాసాంగ్ 17ను అభివర్ణిస్తూ..ఉత్తర కొరియా సైన్యాన్ని బలోపేతం చేసిందన్నారు. ఈమధ్య కాలంలో అతిపెద్ది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో పాల్గొన్న డజన్ల కొద్దీ సైనికాధికారులకు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణుశక్తిని సాధించడమే తమ దేశ అంతిమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కొరియా మీడియా వెల్లడించింది.

కొరియా కొత్త హ్వాసాంగ్ 17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షను పరిశీలించిన తర్వాత కిమ్ ఈ ప్రకటన చేశారు. అణ్వాయుధాలతో అమెరికా అణు బెదింరింపులను ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు. అధికారులకు పదోన్నతి కల్పిస్తూ…అణుశక్తిని నిర్మించడం అనేది రాష్ట్రం, ప్రజల గౌరవం , సార్వభౌమాధికారాన్ని దృఢంగా పరిరక్షించడం అంతిమలక్ష్యం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక శక్తి సంపూర్ణ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అని తెలిపారు.