North Korea : ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధంపై యావత్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. ఈ యుద్ధంలో రష్యా ఆర్మీతో పాటు చైనా సైనికులు, ఉత్తర కొరియా సైనికులు, బెలారస్ సైనికులు పాల్గొంటున్నట్లు ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. ఈనేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన విడుదల చేసింది. ‘‘ మా దేశానికి చెందిన కర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సైనికులను బలంగా తిప్పికొట్టాం. అక్కడి నుంచి తరిమేశాం. ఈక్రమంలో ఉత్తర కొరియా సైనికులు మా సైనికులతో భుజం కలిపి నడిచారు. ఉత్తర కొరియా సైనికులు చాలా గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు’’ అని రష్యా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గెరాసిమోవ్ వెల్లడించారు.
Also Read :India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం వస్తే.. ట్రంప్ ఏం చేస్తారు ? ఏం జరగొచ్చు ?
పుతిన్ కీలక ప్రకటన
ఈ సమాచారాన్ని తమ దేశాధ్యక్షుడు పుతిన్‌కు అందించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కొవ్ తెలిపారు. దీంతో రష్యన్ సైనికులు, కమాండర్లను పుతిన్ అభినందించారు. రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంలోకి కీవ్ చొరబాటు విఫలమైందని పేర్కొంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కర్స్క్‌లో ఉక్రెయిన్ ఓటమి అనేది, తమ సైన్యాల భావి విజయాలకు బాటలు వేస్తుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read :Massive Explosion : ఇరాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి, 561 మందికి గాయాలు
గత సంవత్సరం ఆగస్టులో ఏమైందంటే..
గత సంవత్సరం ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యాలు రష్యాలోని కర్స్క్ ప్రాంతంలోకి చొరబడ్డాయి. కర్స్క్ ప్రాంతంలోని వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుడ్జా సహా దాదాపు 1300 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్(North Korea) సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వందలాది మంది స్థానికులను యుద్ధఖైదీలుగా పట్టుకున్నాయి. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని ఆక్రమించిన తొలి దేశంగా ఉక్రెయిన్ నిలిచింది. తాజాగా ఇటీవలే కర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలను రష్యా తరిమేసింది. ఇందుకోసం ఉత్తర కొరియా సైనిక దళాల సాయాన్ని రష్యా తీసుకుంది. అయితే తాము ఇంకా కర్స్క్ ప్రాంతంలో ఉన్నామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వాదిస్తున్నాయి.