Site icon HashtagU Telugu

North Korea: కిమ్ మరో సంచలన నిర్ణయం.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే..!

Kim Jong Un

Kim Jong Un

ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నిర్ణయాలు వింతగా ఉంటాయి. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని 6 నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాంపులకు తరలిస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వెల్లడించారు. అంతే కాకుండా పిల్లలు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా కిమ్ ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ పత్రిక పేర్కొంది. ఉత్తర కొరియా మరో వింత రూల్ జారీ చేసింది. పాశ్చాత్య మీడియాపై తన చర్యను తీవ్రతరం చేసింది. పిల్లలు హాలీవుడ్ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూస్తూ దొరికితే వారి తల్లిదండ్రులను జైలుకు పంపుతామని ఉత్తర కొరియా పేర్కొంది.

ది మిర్రర్ నివేదిక ప్రకారం పిల్లలు.. హాలీవుడ్ లేదా దక్షిణ కొరియా చిత్రాలను చూస్తున్నట్లయితే వారి తలిదండ్రులు ఆరు నెలలు లేబర్ క్యాంపులో గడపవలసి ఉంటుంది. కానీ పిల్లలు ఇలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష. అయితే, గతంలో ఇలా పిల్లలు ఫారిన్ సినిమాలు చూస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను మందలించి వదిలేసేవారు. ఈ రూల్ ని ఇప్పుడు మార్చారు. విద్యార్థులపై పాశ్యాత్య దేశాల సంస్కృతి ప్రభావం ఉండకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో అమెరికన్ సినిమాలు చూసిన ఇద్దరు ఉత్తర కొరియా హైస్కూల్ విద్యర్థుల్ని ఆ దేశ ప్రభుత్వం ఉరి తీసింది.

Also Read: LPG Cylinder Price: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

పిల్లలకు తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలని, అలా చేయకపోతే వారు సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు. ఎవరైనా అశ్లీల చిత్రాల వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారమందితే కాల్చి చంపాలని గత నెలలో ఆదేశాలు వెలువడ్డాయి.