Kim Jong Un : ఉత్తర కొరియా క్రమక్రమంగా తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. ఓ వైపు నుంచి రష్యా.. మరోవైపు నుంచి ఇరాన్.. ఇంకో వైపు నుంచి చైనా దేశాలు ఉత్తర కొరియాకు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి. అందువల్లే నేటిదాకా దక్షిణ కొరియాను ఆ దేశం ఎదిరించి నిలబడిగలిగింది. తాజాగా ఉత్తర కొరియా సైన్యం అమ్ములపొదిలో మరో కీలకమైన అస్త్రం వచ్చి చేరింది. దాన్ని చూసి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) తెగ సంబరపడిపోతున్నారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి ఎట్టకేలకు సూసైడ్ డ్రోన్ కూడా అందింది. దీని పనితీరును స్వయంగా కిమ్ పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా సోమవారం విడుదల చేసింది. ఈసందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. ‘‘ మా యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపర్చుకోవడానికి సూసైడ్ డ్రోన్ల తయారీని వేగవంతం చేస్తాం’’ అని వెల్లడించారు. ఆ సూసైడ్ డ్రోన్‌కు ఎక్స్ ఆకారపు రెక్కలు ఉన్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన కే-2 యుద్ధ ట్యాంకును పోలి ఉన్న లక్ష్యాన్ని ఆ సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేసినట్టుగా ఉన్న ఒక ఫొటోను ఉత్తర కొరియా మీడియా షేర్ చేసింది.
Also Read :Bank Holidays : సెప్టెంబరులో బ్యాంకు హాలిడేస్ జాబితా ఇదీ..
సాధారణ తరహా డ్రోన్లు ఆకాశంలోనే తిరుగుతూ భూమిపై ఉన్న లక్ష్యం వైపుగా మిస్సైళ్లను సంధిస్తాయి. కానీ సూసైడ్ డ్రోన్లు ఇందుకు పూర్తి విభిన్నం. అవి నేరుగా తమ లక్ష్యంపైకి దూసుకెళ్లి తమను తాము పేల్చుకుంటాయి. ఇప్పుడు ఉత్తర కొరియా దగ్గరున్న సూసైడ్ డ్రోన్లు సముద్రంలో ఉన్న టార్గెట్లను కూడా ఛేదించగలవని అంటున్నారు. ఈవివరాలను ఆ దేశ మీడియా కూడా ధ్రువీకరించింది. ఇన్ని స్పెషాలిటీలు ఉండబట్టే వీలైనంత త్వరగా వీటిని తయారు చేయాలని సైన్యాన్ని కిమ్ ఆదేశించారు. ఈ పరిణామాలు పొరుగునే ఉన్న దక్షిణ కొరియాను కలవరపెడుతున్నాయి.