అక్టోబర్ 16 నుంచి నవంబర్ 17 మధ్య ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపే అవకాశం ఉన్నట్లు దక్షిణ కొరియా జాతీయ గూఢచారి సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని యోన్ హాప్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ అణ్వాయుధాలను వదులుకోవద్దని బహిరంగంగా ప్రకటించాడు. తమ దేశాన్ని బలహీన పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని కిమ్ జోంగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకారం, అణు నిరాయుధీకరణ కోసం చర్చలను తిరిగి ప్రారంభించే ఉద్దేశ్యం ప్యోంగ్యాంగ్‌కు లేదని కింగ్ జోంగ్-ఉన్ స్పష్టం చేశారు. కీలకమైన సెషన్‌లో ఉత్తర కొరియా పార్లమెంట్ ఇప్పటికే కొత్త అణు విధానానికి ఆమోదం తెలిపింది.
ఉత్తర కొరియాను బలహీనపరచాలని అమెరికా కోరుకుంటోంది:
మన అణ్వాయుధాలను నిర్మూలించడమే కాకుండా, ఉత్తర కొరియాను బలహీనపరిచేలా బలవంతం చేయడం ద్వారా మన పాలనను కూల్చివేయడమే అమెరికా లక్ష్యమని కిమ్ జోంగ్-ఉన్ అన్నారు. ఉత్తర కొరియా తన అణు వార్‌హెడ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి తన వ్యూహాత్మక అణు ఆపరేషన్ పరిధిని విస్తరించాలని కిమ్ అన్నారు.
కమలా హారిస్‌పై ఉత్తర కొరియా ఆగ్రహం:
ఇటీవల, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి వచ్చిన కమలా హారిస్ జపాన్ ప్రధాని కిషిదాతో చర్చించారు. ఈ సమయంలో, ఉత్తర కొరియా ఇటీవలి బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో పాటు ఉత్తర కొరియా జపాన్ పౌరులను కిడ్నాప్ చేసిన సమస్యను పరిష్కరించడంపై కూడా ఆయన నొక్కిచెప్పారు. అయితే, హారిస్ జపాన్ పర్యటనపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.