Kim Jong Un : ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలనాలకు మారుపేరు. పొరుగుదేశం దక్షిణ కొరియా పేరు వింటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే ఆయన మరో కీలక ప్రకటన చేశారు. దక్షిణ కొరియాకు షాక్ ఇచ్చే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read :Free Rice Scheme : 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ : కేంద్రం
తమ దేశంలోని దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలను మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ఈవిషయంలో అకస్మాత్తుగా ఇరుదేశాల ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకుగానూ.. దీనిపై అమెరికా ఆర్మీకి ముందస్తు సమాచారాన్ని అందజేశామన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్యనున్న రోడ్లు, రైల్వే మార్గాలను కూడా మూసేస్తున్నట్లు కిమ్ చెప్పారు. ఈ చర్యలను తమదేశం చేపడుతున్న ప్రధాన సైనిక చర్యగా ఆయన అభివర్ణించారు.
Also Read :Gamma Ray Telescope : ప్రపంచంలోనే ఎత్తైన గామారే టెలిస్కోప్.. లడఖ్‌లోనే ఎందుకు ఏర్పాటు చేశారంటే..
- 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇటీవలే కిమ్ నిర్ణయించారు. దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని ఆయన డిసైడ్ చేశారు. అయితే ఉత్తర కొరియా పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
- ఈ ఏడాది జూన్ నెలలో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న పలువురు ఉత్తర కొరియా సైనికులు ఆకస్మిక పేలుళ్ల కారణంగా చనిపోయారు. అదే నెలలో రెండు కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని కొన్ని భాగాలను కూల్చివేసేందుకు ఉత్తర కొరియా యత్నించింది.
- దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి.. అక్కడి నుంచి రాకపోకలను నివారించేందుకు ఉత్తర కొరియా ఈ చర్యలు తీసుకుంటోంది.
- ఇరుదేశాల మధ్య ప్రజల రాకపోకలను నియంత్రించడం ద్వారా ఉత్తర కొరియాలో తన పాలనను సుస్థిరం చేసుకోవాలనే ఆకాంక్షతో కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు. ప్రజలను అణచివేయడం ద్వారా, వారి గొంతును నులిమేయడం ద్వారా ఏ దేశ పాలకులు కూడా చిరకాలం రాజకీయ మనుగడను సాగించలేరని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.