Kim – Putin – Gift : కిమ్‌కు పుతిన్ అదిరిపోయే గిఫ్ట్.. ఏమిటో తెలుసా ?

Kim - Putin - Gift : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దోస్తీ రోజురోజుకు మరింత పెరుగుతోంది.

  • Written By:
  • Updated On - February 20, 2024 / 11:22 AM IST

Kim – Putin – Gift : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దోస్తీ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కిమ్ జోంగ్ ఉన్‌కు పుతిన్ ఒక స్పెషల్ గిఫ్టును పంపారు.  ఆ గిఫ్టును ఫిబ్రవరి 18న కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఆ గిఫ్టు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఉత్తర కొరియాకు లగ్జరీ వస్తువుల రవాణాపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరైనా, ఏదైనా లగ్జరీ వస్తువును పంపితే  ప్రపంచ దేశాల ఆంక్షల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈవిషయం తెలిసి కూడా పుతిన్ సాహసం చేసి తన మిత్రుడికి ఒక కానుకను పంపించారు.  అదొక లగ్జరీ కారు. కొత్త కొత్త ఫీచర్స్‌తో రష్యాలో తయారు చేసిన కారు అది. ఇద్దరి స్నేహానికి గుర్తుగా ఈ కారును కిమ్‌కు పుతిన్ కానుకగా ఇచ్చారట. దీన్ని ఇకపై ఉత్తర కొరియా నియంత కిమ్(Kim – Putin – Gift)  వ్యక్తిగత అవసరాలకు వాడుకోనున్నారు.

Also Read :Imran Khan : పాక్‌లో ఇమ్రాన్ సర్కారు.. అనుచరుల స్కెచ్ !?

కిమ్ జోంగ్ ఉన్​కు లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే లగ్జరీ కార్లు బోలెడు ఉన్నాయి. ఈ లిస్టులో మెర్సిడెస్, రోల్స్ రాయిస్, మేబ్యాక్, లెక్సస్​ వంటి కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ కొరియాకు అక్రమంగా రవాణా చేయించుకున్నారట.  గతేడాది సెప్టెంబర్​లో రష్యా పర్యటనకు వెళ్లిన కిమ్.. పుతిన్ వాడుతున్న ‘ఆరస్ సెనేట్ లిమోసిన్​’ కారును ఆసక్తిగా చూశారట. కిమ్ ఆసక్తిని గమనించి ఆయన్ను తన కారులో పుతిన్ ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేశారట. తాజాగా కిమ్‌కు పుతిన్ పంపింది కూడా ‘ఆరస్ సెనేట్ లిమోసిన్​’ మోడల్ కారేనని తెలుస్తోంది. ఉక్రెయిన్​పై చేస్తున్న యుద్ధంలో రష్యాకు కిమ్ సహకరిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. రాకెట్లు, క్షిపణులు సహా అనేక రకాల ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read :Jayalalitha Jewellery : 6 పెట్టెల్లో జయలలిత ఆభరణాలు.. అవన్నీ ఎవరికో తెలుసా ?