North Korea Vs South Korea : మిస్సైళ్లతో విరుచుకుపడిన ఉత్తర కొరియా.. దక్షిణ కొరియా వార్నింగ్

North Korea Vs South Korea : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.. దక్షిణ కొరియా పశ్చిమ సరిహద్దుల్లోని సముద్ర తీరం దిశగా ఉత్తర కొరియా శనివారం తెల్లవారుజామున మళ్ళీ పలు క్రూయిజ్ మిస్సైల్స్ ను ప్రయోగించింది.. 

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 08:29 AM IST

North Korea Vs South Korea : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.. 

దక్షిణ కొరియా పశ్చిమ సరిహద్దుల్లోని సముద్ర తీరం దిశగా ఉత్తర కొరియా శనివారం తెల్లవారుజామున మళ్ళీ పలు క్రూయిజ్ మిస్సైల్స్ ను ప్రయోగించింది.. 

జూలై 12న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని, జులై 19న రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఇప్పుడు ఇంకోసారి మిస్సైల్స్ తో విరుచుకుపడింది. 

దీంతో ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 

Also read : Citizenship: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు.. గత మూడేళ్లలో 5 లక్షల మంది..!

ఉత్తర కొరియా తమ దేశ భూభాగం వైపుగా క్షిపణులు ప్రయోగించిన విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మీడియాకు వెల్లడించారు. జులై 19న అమెరికాకు చెందిన ఓహియో-క్లాస్ న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని (SSBN) దక్షిణ కొరియా సముద్ర జలాల్లో గుర్తించిన నేపథ్యంలో .. ఉత్తర కొరియా రెచ్చిపోయి ఈ క్షిపణులను ప్రయోగించిందన్నారు. మరోవైపు దీనిపై ఉత్తర కొరియా(North Korea Vs South Korea) కూడా స్పందించింది. దక్షిణ కొరియాలో అమెరికా విమాన వాహక నౌకలు, బాంబర్లు, క్షిపణి జలాంతర్గాములను మోహరించడం అనేది అణ్వాయుధ వినియోగం దిశగా తమ దేశాన్ని నడిపిస్తున్నాయని  వార్నింగ్ ఇచ్చింది.  దీనిపై స్పందించిన దక్షిణ కొరియా.. “ఉత్తర కొరియా వైపు నుంచి తమపై ఏదైనా అణుదాడి జరిగితే కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని పాలన అంతం కావడం ఖాయం” అని హెచ్చరించింది.

Also read : INDIA Win 2024 : ఈ 3 సవాళ్లను అధిగమిస్తే.. “ఇండియా”దే గెలుపు!