Spy Satellite : ఎట్టకేలకు ఉత్తర కొరియా తాను అనుకున్నదే చేసి చూపించింది. దక్షిణ కొరియా వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. మంగళవారం అర్ధరాత్రి ‘మల్లిగ్‌యాంగ్-1’ అనే పేరు కలిగిన స్పై శాటిలైట్ (గూఢచార ఉపగ్రహం)ను విజయవంతంగా ప్రయోగించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. “చోల్లిమా-1” అనే క్యారియర్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించిన 12 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యలోకి స్పై శాటిలైట్ చేరిపోయింది. ఈ ఉపగ్రహం ఉత్తర కొరియా పొరుగు దేశాల్లో (దక్షిణ కొరియా, జపాన్) సైనికపరమైన యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రయోగం జరిగిన ప్రదేశానికి ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వచ్చారని.. అది సక్సెస్ అయిన వెంటనే సైంటిస్టులను ఆయన అభినందించారని తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయిందనే విషయాన్ని ఉత్తర కొరియా అంతరిక్ష సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఆత్మరక్షణ కోసం ఉత్తర కొరియా తప్పకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసకుంటుందని స్పష్టం చేసింది.
Also Read: Israel-Hamas Deal : నాలుగు రోజుల యుద్ధ విరామం.. 50 మంది ఇజ్రాయెలీలు, 150 మంది పాలస్తీనియన్ల రిలీజ్
ఈ ప్రయోగం నిర్వహణలో ఉత్తర కొరియాకు రష్యా సహకారం అందించిందనే ప్రచారం జరుగుతోంది. దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఉన్న నేపథ్యంలో.. ఉత్తర కొరియాను స్పేస్ రీసెర్చ్‌లో బలోపేతం చేసే దిశగా రష్యా కసరత్తును ముమ్మరం చేసిందని అంటున్నారు. శాటిలైట్ల ద్వారా ఉత్తర కొరియా టెలికాం వ్యవస్థను, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని పుతిన్ యోచిస్తున్నారు. కాగా, ఉత్తర కొరియా ప్రయోగాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్(Spy Satellite) ఖండించారు.