Nobel Prize – Chemistry : కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్

Nobel Prize - Chemistry :  ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 04:17 PM IST

Nobel Prize – Chemistry :  ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌ లను నోబెల్ బహుమతికి ఎంపిక చేశామని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం వెల్లడించింది. క్వాంటమ్ డాట్స్ ను కనుగొనడంతో పాటు వాటి విశ్లేషణపై ప్రయోగాలు చేసినందుకు వీరికి నోబెల్ ను ఇస్తున్నట్లు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

భౌతిక శాస్త్రం, వైద్య శాస్త్రంలో.. 

భౌతిక శాస్త్రంలో జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు నోబెల్‌ బహుమతిని మంగళవారమే ప్రకటించారు. అణువుల్లో ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడంలో భాగంగా కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేయడంపై చేసిన పరిశోధనలకుగానూ వీరిని అవార్డుకు ఎంపిక చేశారు. ఫిజిక్స్ విభాగంలో నోబెల్ పొందిన 5వ మహిళా శాస్త్రవేత్తగా హ్యులియర్ నిలిచారు. ఇక ఎంఆర్ఎన్ఏ రకం కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ లకు వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్లలో చేసిన ఆవిష్కరణలకుగానూ (Nobel Prize – Chemistry)  వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

Also read : Ranbir Kapoor: రణబీర్ కపూర్‌ కు ఈడీ నోటీస్.. విచారణకు హాజరుకావాలని ఆదేశం!