ప్రతి అమెరికా అధ్యక్షుడు ఎదుర్కొంటున్నట్టే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికైన రెండేళ్ల తరువాత పరిపాలన మీద మధ్యంతర ఎన్నికలు అమెరికా కాంగ్రెస్ సిద్ధం కావడం ఆనవాయితీ. అమెరికాలో 2022 నవంబర్ 8న మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రెండేళ్లలో జో బైడెన్ పాలనపై ప్రభావం చూపనుంది.
ఈ ఎన్నికలు ( భారత్ లో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుట్టు) అమెరికా కాంగ్రెస్‌కు సంబంధించినవి. అమెరికా కాంగ్రెస్( భారత పార్లమెంట్ తరహా) లో రెండు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ), రెండు సెనేట్. సాధారణంగా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడి పనితీరుపై ఒక తీర్పులాంటిది. ఆగస్టు నుంచి ఓటర్ల మధ్య బైడెన్‌కు ఆమోదం తెలిపే రేటు 50 శాతం కన్నా తక్కువగా ఉంటోంది. ఇది వైట్ హౌస్ లోని బైడెన్ కు ఆందోళన కలిగించే అంశం.
Also Read: PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!
ఈ ఎన్నికల్లో డెమోక్రట్లు మెజారిటీ సాధిస్తే, బైడెన్ తన విధానాలను కొనసాగించవచ్చు. వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హెల్త్‌కేర్ కార్యక్రమాలు, అబార్షన్ హక్కులను రక్షించడం, గన్ కల్చర్‌ను అదుపుచేయడం తదితర చట్టాలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. హౌస్‌లోగానీ, సెనేట్‌లోగానీ రిపబ్లికన్లు ఆధిక్యంలోకి వస్తే బైడెన్ విధానాలకు చెక్ పడుతోంది. అలాగే, దర్యాపు కమిటీలపై పట్టుబిగిస్తారు. తద్వారా 2021 జనవరి 6న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్‌పై దాడి చేసిన కేసును ముగించవచ్చు. అలాగే, కన్జర్వెటివ్స్‌కు ఆసక్తి ఉన్న అంశాలలో దర్యాప్తు ప్రారంభించవచ్చు.
ఉదాహరణకు, జో బైడెన్ చిన్న కొడుక్కి చైనా వ్యాపారాలతో ఉన్న సంబంధాలు లేదా అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాల విరమణ. బైడెన్‌కు కొత్త నియామకాలు చేయడం కష్టం కావచ్చు. అమెరికా సుప్రీంకోర్టు నియామకాలైనా సరే సాధ్యం కాకపోవచ్చు. రిపబ్లికన్ల ఆధిపత్యం బైడెన్ విదేశాంగ విధానాలను కూడా ఆటకం కలిగించవచ్చు. ముఖ్యంగా, ఉక్రెయిన్‌కు సహాయం అందించే విషయంలో అభ్యంతరాలు ఎదురుకావొచ్చు. అయితే, బైడెన్ తన వీటో హక్కును ఉపయోగించుకుని అబార్షన్, వలసలు, పన్నులపై చట్టాలను అడ్డుకోవచ్చు.
Also Read: MLC Kavitha: చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా!