Site icon HashtagU Telugu

Saudi : భారతీయులకు శుభవార్త చెప్పిన సౌదీ..వీసాకు ఈ సర్టిఫికేట్ అవసరం లేదు.!!

Saudi

Saudi

సౌదీ అరేబియా, భారతదేశం మధ్య ఈ మధ్యే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని అవగాహనలను అమలు చేసేందుకు సౌదీ సర్కార్ రెడీ అయ్యింది. అవేంటంటే…ఇప్పటివరకు భారతీయులు సౌదీ వెళ్లాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాని కోసం పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవరసం. వీసా దరఖాస్తుతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ క్లియర్ రెన్స్ సర్టిఫికేన్ కచ్చితంగా జత చేయాల్సిందే. అయితే ఇకపై ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు భారత్ లోని సౌదీ అరేబియా ఎంబసీ ప్రకటించింది. అంటే సౌదీ వెళ్లాలనుకునే భారతీయులు ఇక నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను జతచేయాల్సిన అవసరం లేదని దీని సారాంశం.

కాగా సౌదీలో దాదాపు 22లక్షల మంది భారతీయులు ఉన్నారు. కరోనా సమయంలో చాలామంది భారత్ కు తిరిగి వచ్చారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి సౌదీ వెళ్లేందుకు చాలా మంది వీసా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తీసుకున్న తాజా నిర్ణయం భారతీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. సౌదీ డెవలప్ మెంట్ కోసం భారతీయులు ఎంతో క్రుషి చేస్తున్నారని….తమ దేశంలో భారతీయులు శాంతియుత జీవనం కొనసాగిస్తున్నారని సౌదీ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.