Site icon HashtagU Telugu

Kim Jong Un: ఉత్తర కొరియాలో ఆహార కొరత.. కానీ కిమ్‌ తాగే వైన్‌ ధరెంతో తెలుసా..?

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ముదురుతోంది. అయితే వీటన్నింటిని విస్మరించి ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన విలాసాలలో మునిగిపోయాడు. దేశప్రజలు ఆకలి చావుల అంచున నిలవడం ఆయన ఆరోగ్యానికి పట్టింపు లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా..? కిమ్ జోంగ్-ఉన్‌కి ఖరీదైన మద్యం, ప్రత్యేకమైన సిగరెట్లు, విదేశీ మాంసం అవసరం. డైలీ స్టార్‌తో మాట్లాడుతూ UK రక్షణ నిపుణుడు నియంత కిమ్ జోంగ్ బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, హెన్నెస్సీ బ్రాందీని తాగడానికి ఇష్టపడేవాడు అని పేర్కొన్నారు. దీని ధర $ 7,000 వరకు ఉంటుంది.

నాణ్యమైన మద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

కొన్ని సంవత్సరాల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ పబ్లిక్ చేసిన వాణిజ్య గణాంకాల ప్రకారం.. 40 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలోకి అధిక నాణ్యత గల మద్యాన్ని దిగుమతి చేసుకోవడానికి సంవత్సరానికి $30 మిలియన్లు ఖర్చు చేస్తున్నాడు. నియంత ఖరీదైన మద్యంతో పాటు రుచికరమైన ఆహారాన్ని కూడా ఇష్టపడతాడు. ఆయనకు పర్మా హామ్ (ఇటలీలోని పార్మా ప్రాంతం నుండి వచ్చిన వంటకం), స్విస్ ఎమెంటల్ చీజ్ అంటే చాలా ఇష్టం.

Also Read: CBN P4 Formula : `పూర్ టూ రిచ్ `తో   ఆర్థిక విప్ల‌వం

కిమ్ మాజీ సుషీ చెఫ్ UK టాబ్లాయిడ్‌తో సంభాషణ సందర్భంగా గతంలో కిమ్, ఆయన తండ్రి తరచుగా కోబ్ స్టీక్ (ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం), క్రిస్టల్ షాంపైన్‌ను కలిసి తీసుకునేవారని వెల్లడించారు. ఉత్తర కొరియా నియంతకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని మాజీ చెఫ్ పేర్కొన్నాడు. 1997లో ఒక ఇటాలియన్ చెఫ్‌ని కిమ్ కుటుంబం ప్రత్యేకంగా పిజ్జా చేయడానికి నియమించింది. ఈ కుటుంబానికి పిజ్జా అంటే ఎంత ఇష్టమో దీన్నిబట్టి తెలుస్తుంది.

నియంత ప్రత్యేకమైన సిగరెట్ తాగుతాడు

ఇది మాత్రమే కాదు అసాధారణ నియంత బ్రెజిలియన్ కాఫీని ఇష్టపడతాడు. దాని కోసం అతను సంవత్సరానికి $ 9,67,051 ఖర్చు చేస్తాడు. దీనితో పాటు కిమ్ చాలా ప్రత్యేకమైన సిగరెట్‌ను తాగుతున్నాడు. ఈ సిగరెట్ చిత్రాలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. బహిరంగ కార్యక్రమాల్లో కూడా కిమ్ చాలాసార్లు సిగరెట్ తాగుతూ కనిపించాడు. బంగారు రేకుతో చుట్టబడిన వైవ్స్ సెయింట్ లారెంట్ బ్లాక్ సిగరెట్లను కిమ్ తాగుతాడని చెబుతారు. 2014 UK మెట్రో నివేదిక ప్రకారం.. కిమ్ క్రమం తప్పకుండా “స్నేక్ వైన్” సేవించేవాడని, ఇది పురుషత్వాన్ని పెంచుతుందని పుకారు వచ్చింది.

Exit mobile version