Italy Floods: ఇటలీలో భారీ వరదలు.. 9 మంది మృతి

ఉత్తర ఇటలీ (Italy)లోని ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదల (Floods) కారణంగా 9 మంది మృతి చెందారు.భారీ వర్షాల తర్వాత వీధులన్నీ నీటితో నిండిపోయాయి.

Published By: HashtagU Telugu Desk
Italy Floods

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Italy Floods: ఉత్తర ఇటలీ (Italy)లోని ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదల (Floods) కారణంగా 9 మంది మృతి చెందారు.భారీ వర్షాల తర్వాత వీధులన్నీ నీటితో నిండిపోయాయి. నీటి ముంపు కారణంగా ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు అల్ జజీరా బుధవారం ఈ విషయాన్ని నివేదించింది.

వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వరద ప్రభావిత ప్రాంతం నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 36 గంటల్లో వార్షిక వర్షపాతంలో సగం కురిసిందని పౌర రక్షణ మంత్రి నెలో ముసుమేసి తెలిపారు. ఇటలీ సాధారణంగా ఏడాది పొడవునా 1000 మిమీ వర్షాన్ని పొందుతుంది. అక్కడ 36 గంటల్లో 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నదులు పొంగిపొర్లడం, నగరాల్లోని రహదారులన్నీ నీటితో నిండిపోవడంతో పాటు వేలాది హెక్టార్ల వ్యవసాయ భూములు వరద ముంపునకు గురయ్యాయి. వరదల కారణంగా ఇమోలాకు దక్షిణంగా, ఫెంజా, సెసెనా, ఫోర్లీ వీధుల గుండా ఆపి ఉంచిన కార్ల పైకప్పులపైకి బురద నీరు పొంగిపొర్లింది. పలు దుకాణాలు కూడా మురికి నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇళ్లపైనే తలదాచుకోవాల్సి వచ్చింది.

Also Read: Tahawwur Rana: ముంబై పేలుళ్ల నిందితుడు తహవుర్ రాణాకు షాక్.. భారత్​కు అప్పగించనున్న అమెరికా..!

50 వేల మందికి విద్యుత్‌ అందడం లేదు

ముసుమేసి ప్రకారం 50,000 మందికి విద్యుత్ సౌకర్యం లేదు. ప్రధాని జార్జియా మెలోని బాధిత వ్యక్తుల కోసం ట్వీట్ చేశారు. అవసరమైన సహాయంతో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అత్యవసర సేవలు సహాయ చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇమోలాలో ఆదివారం జరగాల్సిన కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఫార్ములా వన్ ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ వరదల కారణంగా వాయిదా పడింది. ఈ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలలో ఒకటి. “వరదలు కారణంగా ఫార్ములా వన్ ఈవెంట్‌లను నిర్వహించడం సాధ్యం కాదు” అని నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేసినట్లు అల్ జజీరా తెలిపింది.

  Last Updated: 18 May 2023, 10:18 AM IST