Nikki Haley : పోటీ లేకున్నా ఓడిపోయిన నిక్కీ హేలీ.. ఎలా ?

Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ  అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి వనిత నిక్కీ హేలీకి షాకిచ్చేలా ఒక ఫలితం వచ్చింది.

  • Written By:
  • Updated On - February 7, 2024 / 03:55 PM IST

Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ  అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి వనిత నిక్కీ హేలీకి షాకిచ్చేలా ఒక ఫలితం వచ్చింది. తాజాగా నెవాడాలో రిపబ్లికన్‌ పార్టీ నిర్వహించిన ప్రైమరీ ఎన్నికలో ఆమె చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరీ ఘోరం ఏమిటంటే.. ఈ ఎన్నికలో ప్రత్యర్థులు ఎవరూ లేకపోయినా నిక్కీ హేలీ ఓటమిని చవిచూశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓటర్లంతా  ‘నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌’ అనే మీటనే నొక్కేశారు. తద్వారా నిక్కీ హేలీ అభ్యర్ధిత్వాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా తిరస్కరించారు. ‘నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌’ అనే వోటింగ్ ఆప్షన్.. అచ్చం మన ఇండియాలో అందుబాటులో ఉన్న ‘నోటా’ లాంటిది. ఆశ్చర్యకరంగా నెవాడా ప్రైమరీ ఎన్నికలో ‘నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌’ ఆప్షన్‌కు 61 శాతం ఓట్లు పోలయ్యాయి. నిక్కీకి అత్యంత తక్కువగా 32 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నెవాడా ప్రైమరీలో గెలుస్తాననే నిక్కీ హేలీ అంచనాలు తలకిందులయ్యాయి. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమోక్రట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు ప్రైమరీలు జరిగాయి. డెమోక్రట్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ గెలుపొందారు. రిపబ్లికన్ల తరఫున ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ బరిలో నిలవకపోగా, నిక్కీ హేలీ(Nikki Haley) మాత్రమే పోటీ చేసి చేదు ఫలితాలను చవిచూశారు.

We’re now on WhatsApp. Click to Join

మొత్తంగా ప్రైమరీల్లో నిక్కీ హేలీకి ఇది మూడో ఓటమి. వరుస విజయాలతో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌ దూకుడు మీద ఉన్నారు.ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు ప్రైమరీ ఎన్నికలను నిర్వహిస్తున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాల్లో గెలుపొందే నేతనే తమ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేస్తాయి. ఇక అంతకుముందు డిక్స్‌విల్లే నాచ్  ప్రైమరీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  నిక్కీ హేలీ గెలిచారు.మొత్తం ఆరుకు ఆరు ఓట్లను హేలీ కైవసం చేసుకున్నారు. న్యూ హ్యాంప్‌షైర్ ఫస్ట్ రౌండ్‌లో డిక్స్‌విల్లే నాచ్‌లోని ఆరు రిజిస్ట్రర్డ్ ఓటర్లు హేలీని ఎన్నుకున్నారు. దీనిపై నిక్కీ హేలీ హర్షం వ్యక్తం చేశారు.

Also Read : 400 Paar Vs 40 Seats : ఖర్గే, మోడీ మధ్యలో దీదీ.. ‘400 పార్’‌ వర్సెస్ ‘40 సీట్లు’.. ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో అత్యంత కీలకమైన డెలిగేట్స్ ఫైనల్ పోల్‌లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో గ్రానైట్ సంపన్న రాష్ట్రం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన డెలిగేట్స్ ఎన్నికలలో మాజీ రాయబారి నిక్కి హెలిపై 13 9 ఓట్ల తేడాతో ట్రంప్ గెలిచారు. ప్రైమరీ ఎన్నికల్లో డెలిగేట్స్ మధ్య పోటీ కీలకం అవుతుంది. రాష్ట్రాల వారి డెలిగేట్స్ ఎంపిక, ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపికకు వారి కీలక మద్దతు రిపబ్లికన్ పార్టీలో ప్రధానం అవుతుంది. ఇక్కడ జరిగిన పోల్‌లో మొత్తం మీద వ్యక్తం అయిన మద్దతు పరిశీలిస్తే న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్ పట్ల డేలిగేట్ల సానుకూలత 13 శాతం కాగా హేలీ పట్ల వ్యక్తం అయిన మద్దతు 9 శాతంగా ఉంది.